- Telugu News Photo Gallery Cinema photos Tollywood celebrities birthday list in april month allu arjun samantha akhil nithya menon jayaprada
Celeb birthdays in April: అల్లు అర్జున్, సమంతతోపాటు ఏప్రిల్‌లో పుట్టిన రోజులు జరుపుకోనున్న స్టార్స్ వీళ్లే..
Tollywood celebs birthdays in April: ఏప్రిల్ నెలకు చాలా స్పెషల్ ఉంది. ఎందుకంటే ఈ నెలలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రెటీల పుట్టినరోజులు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, సమంత అక్కినేనితోపాటు ప్రభుదేవా, నిత్యమీనన్, రామ్ గోపాల్ వర్మ వరకు ఇలా చాలా మంది సినీ ప్రముఖులు పుట్టినరోజులున్నాయి. ఇంకా ఎవరెవరున్నారో తెలుసుకుందామా..
Updated on: Apr 01, 2021 | 11:19 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఏప్రిల్ 8న 1983లో జన్మించాడు. మొదటి సినిమా గంగోత్రితో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ మెగా హీరో. కేవలం నటన మాత్రమే కాకుండా.. తన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఆగస్ట్ 13న విడుదల కానుంది.


అక్కినేని అఖిల్.. ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2015లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నాడు.

సిద్ధార్థ్ నారాయణ్.. ఏప్రిల్ 17న 1979లో చెన్మైలో జన్మించారు. తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్న సిద్దార్థ్.. డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నారు.

రామ్ గోపాల్ వర్మ.. ఏప్రిల్ 7న పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆర్జీవి.. ఆ తర్వాత డైరెక్టర్‌గా మారాడు. నాగార్జునతో కలిసి ఆయన తెరకెక్కించిన శివ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

స్వాతి రెడ్డి... ఏప్రిల్ 9న తన పుట్టినరోజు జరుపుకోబోతుంది. టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. కలర్స్ స్వాతిగా మంచి గుర్తింపు పొందింది. 2008లో తమిళ సినిమా సుబ్రమణ్యపురం ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అష్టా చెమ్మ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది.

ప్రభుదేవా.. ఏప్రిల్ 3న 48వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నాడు. బెస్ట్ కోరియోగ్రాఫర్, యాక్టర్, హీరో, డైరెక్టర్‌గా తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా.

సిమ్రాన్.. ఏప్రిల్ 4న 1976లో ముంబైలో జన్మించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది.

నిత్యామీనన్.. ఏప్రిల్ 8న తన పుట్టినరోజు జరుపుకోనుంది. కేరళలోని కాలికట్లో జన్మించిన నిత్యా.. ఎనిమిదేళ్ళ వయసులోనే హనుమాన్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అలరించింది. తెలుగులో అలా మొదలైంది సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జయప్రద.. ఏప్రిల్ 3న 1962లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించింది. అలనాటి హీరోలు ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి అగ్రనాయకుల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.




