పవన్ కోసమే ఉమెన్ ఎంపవర్‏మెంట్ స్టోరీ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో మెయిన్ పాయింట్ అదే.. డైరెక్టర్ వేణు శ్రీరామ్..

Director Sri Ram Venu: ఒక అభిమానిగా తన ఫెవరేట్ హీరోను డైరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది.. ఈ సినిమాను ఎంతో సంతోషంగా తీసుకున్నాను.. ఇక మేకింగ్ సమయంలో

పవన్ కోసమే ఉమెన్ ఎంపవర్‏మెంట్ స్టోరీ.. 'వకీల్ సాబ్' సినిమాలో మెయిన్ పాయింట్ అదే.. డైరెక్టర్ వేణు శ్రీరామ్..
Director Sriram Venu
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Apr 01, 2021 | 1:08 PM

Director Sri Ram Venu: ఒక అభిమానిగా తన ఫేవరెట్ హీరోను డైరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది.. ఈ సినిమాను ఎంతో సంతోషంగా తీసుకున్నాను.. ఇక మేకింగ్ సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు అంటూ చెప్పుకోచ్చాడు వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్.

‘ఓ మై ఫ్రెండ్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘ఎంసీఏ’ సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏తో తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నాడు.

”మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని.. సంతోషాన్ని.. ఇప్పుడు పొందుతున్నాను. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. అలా  ప్రతి సినిమాకు, దర్శకుడికి కూడా ఉంటాయి. నేను ఎంసీఏ సినిమా సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి రోజు ఎంజాయ్ చేశాను. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి పవన్ కళ్యాణ్‌ను పలుసార్లు కలిసినప్పుడు.. ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ విషయంలో పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ‘వకీల్ సాబ్’ సినిమాను పవన్ ఇమేజ్‌ను గుర్తు చేసుకుంటూ తెరకెక్కించాను. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‏కు నచ్చే విధంగా ఈ మూవీని తీయాలనుకున్నాను అని తెలిపాడు.

ప్రస్తుతం ఆయనకు బాధ్యతగల సినిమాలు మాత్రమే కావాలి. ఇంతకంటే కమర్షియల్ కథలు మరేముంటాయి అంటూ వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ట్రైలర్‏లోనే కథ చెప్పేశాను. అది ట్రైలర్ చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్‏మెంట్ గురించి ఇప్పటికే రెండు భాషల్లో ఇదే సినిమా చేసారు. వకీల్ సాబ్ సినిమాలోనూ అదే మెయిన్ పాయింట్ ఉంటుంది అని తెలిపాడు వేణు శ్రీరామ్.

Also Read: ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాలను అందుకున్నా.. అందుకు కారణం మాత్రం వాళ్ళే.. నాగార్జున..

ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు… అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu