Samantha Akkineni: మరో మైలురాయిని చేరుకున్న అక్కినేనివారింటి కోడలు సమంత
Samantha Akkineni:అక్కినేనివారింటికి కోడలు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని సినిమాల్లో నటిస్తూనే.. తన అభిమానులతో...
Samantha Akkineni: అక్కినేనివారింటికి కోడలు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని సినిమాల్లో నటిస్తూనే.. తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది. కరోనా ప్రభావంతో జాను రీమేక్ తర్వాత సినిమామరో సినిమాలో నటించలేదు. అయితే ఓటిటి కోసం యాంకర్ గా మెగాస్టార్ చిరంజీవి నే ఇంటర్వ్యూ చేసింది. బుల్లితెరపై సందడి చేసింది.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత మరో మైలుకు చేరుకుంది. తాజాగా సమంత ఇన్‌స్టాలో మరో మార్క్‌ను రీచ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా తెలియజేస్తూ అభిమానులకు థాంక్స్ చెప్పింది.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రంలో శకుంతల పాత్రధారిలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది.
సమంత అక్కినేని పదేళ్ల క్రితం ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది. పదేళ్లకు పైగా సాగిన సమంత సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా నటించింది సమంత. 28 ఏప్రిల్, 1987 చెన్నైలో జన్మించిన సమంత అక్కినేని నాగార్జున కోడలిగా అడుగు పెట్టింది. మనం సినిమాలో నాగార్జున కు అమ్మగానటించిన సమంత ఆ ఇంటికి కోడలుగా వెళ్లడం విశేషం. 2017లో నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది.
Also Read: Horoscope Today:ఈరోజు ఏ రాశివారికి ఉద్యోగ, వ్యాపారవిషయాల్లో మంచి ఫలితాలు వస్తావయో.. తెలుసుకుందాం..!