ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాలను అందుకున్నా.. అందుకు కారణం మాత్రం వాళ్ళే.. నాగార్జున..

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ఏఎయన్నార్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ.

ఆ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాలను అందుకున్నా.. అందుకు కారణం మాత్రం వాళ్ళే.. నాగార్జున..
Akkineni Nagarjuna
Rajitha Chanti

|

Apr 01, 2021 | 7:06 AM

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ఏఎయన్నార్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ.. యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోలను సైతం వెనక్కు నెట్టెస్తున్నాడు తన ఫిట్‏నెస్ శరీరంతో. అందుకే ఇప్పటికీ ఆయనను అభిమానులు మన్మథుడు, కింగ్ అని పిలుచుకుంటుంటారు. కొత్తదనాన్ని.. కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలున్నాయి. ఇప్పటివరకు 40 మంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఇటీవల అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించాడు నాగార్జున..

వైల్డ్ డాగ్ స్టోరీని 2019 జూలై, ఆగస్ట్ మధ్యలోనే విన్నాను. అప్పుడు నేను బంగార్రాజు సినిమా కోసం రెడీ అవుతున్నాం. అయితే బంగార్రాజు సంక్రాంతికి వస్తేనే బాగుంటుందనుకున్నాం. ఇక వైల్డ్ డాగ్ స్టోరీ తొందరగా పూర్తవుతుందనుకున్నాం అందుకే డిసెంబర్‏లోనే దీనిని స్టార్ట్ చేశాం. మార్చి వరకు చిత్రీకరణం చేశాం. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చింది. దీంతో ఈ మూవీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం మిగిలిన సినిమాను పూర్తిచేసాం అంటూ చెప్పుకోచ్చాడు నాగార్జున. ఈ సినిమాలో నా పాత్ర దాదాపు 30 నిమిషాల నిడివి ఉంటుంది. ఇది నా కెరీర్‏లోనే మరో శక్తిమంతమైనది. ఈ మూవీ కోసం నేను ఎవరినీ కలవలేదు.. కానీ మా డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ కలిశారు. సర్జికల్ స్ట్రైక్‏లో పాల్గోన్న ఓ ఆర్మీ మేజర్‏ను కలిశాడు. తను మా లోకేషన్ కు వచ్చి మాకు సహకారం అందించారు. గన్స్, గ్రనేడ్లు ఎలా పట్టుకోవాలి ? వాళ్ళ చేతి కదలికలు, సంజ్ఞలు ఎలా ఉంటాయనే విషయాల్ని మాకు చెప్పారు. దర్శకుడు ఈ కథ చెప్తున్నప్పుడే ఇలాంటివి రియల్ గా తీస్తే బాగుంటాయి అన్నాను. మూడు నెలల దాని మీద పరిశోధన చేసి.. ఆ తర్వాత మూవీ స్టార్ట్ చేశాం. ఇక 2008లో మనదేశంలో ఎన్ఐవి ఏర్పాటు చేశారు. వాళ్లు ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కోసం రహస్య ఆపరేషన్లని ఎలా నిర్వహిస్తారనే అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. పుణెలోని జర్మనీ బేకరీ మొదలుకొని దేశంలో 17 చోట్ల బాంబు దాడులు జరిగాయి. హైదరాబాద్‌లో జంట పేలుళ్లు అందులో భాగం. ఆ పేలుళ్ల వెనక కుట్రని ఛేదించడం కోసం ఎన్‌.ఐ.ఎ ఆరుగురితో కూడిన ఓ బృందాన్ని నియమిస్తుంది. వాళ్లు ఏం చేశారన్నదే ఈ సినిమా. ఇందులో నేను విజయ్ వర్మగా కనిపిస్తా.. నా కెరీర్‏లోనే గొప్పగా చెప్పుకునే పాత్ర అవుతుంది అని తెలిపారు నాగార్జున..

నాకు చేసిన క్యారెక్టర్లు చేయడం ఇష్టం ఉండదు. అందుకే నేను కొత్త దర్శకులను పరిచయం చేస్తా. అలాగే కొత్త దర్శకుల వలన సినిమాకు కొత్తదనం వస్తుంది. అలాగే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. ఇక కొత్త దర్శకులతో పనిచేయడం వలన ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా.. విజయాలను అందుకున్నా.. నేను ఈ రోజు స్టార్ అయ్యానంటే కారణం కొత్త దర్శకులు, వాళ్ళలోని కొత్తదనం వల్లే అంటూ తెలిపాడు నాగార్జున.

Also Read: సుడిగాలి సుధీర్ గురించి ఏదైనా చెప్పండి సర్.. షాకింగ్ రిప్లై ఇచ్చిన నాగబాబు.. మొత్తానికి పరువు తీసేసాడుగా..

బాలయ్య న్యూలుక్ అదుర్స్.. బోయపాటి సినిమా కోసమే ఇలా మారాడా.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu