రామ్ చరణ్, శంకర్ సినిమాకు షాక్.. సినిమా ఆపేయాలంటూ కోర్డులో కేసు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..

Ram Charan Shankar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.

రామ్ చరణ్, శంకర్ సినిమాకు షాక్.. సినిమా ఆపేయాలంటూ కోర్డులో కేసు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..
Ram Charan Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2021 | 2:36 PM

Ram Charan Shankar Movie Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ శంకర్‏ల సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్న విషయం తెలిసింది. అయితే తాజాగా ఈ మూవీని ఆపేయాలంటూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా… మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రామ్ చరణ్ సినిమా కంటే ముందు శంకర్.. కమస్ హసన్‌తో ‘ఇండియా 2’ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‏లో అగ్రిప్రమాదం జరగడం.. అందులో కొంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దీంతో ఈ మూవీ మేకర్స్ నష్టపరిహరాలు చెల్లించారు. ఈ ప్రమాదం తర్వాత శంకర్ మళ్లీ భారతీయుడు సినిమా గురించి ఎలాంటి అప్‏డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుడు 2 సినిమాకు తాము రూ.236 కోట్లు ఖర్చు చేశామని.. అంతేకాకుండా.. శంకర్‏కు పారితోషకంగా రూ.40 కోట్లలో రూ.14 కోట్లు చెల్లించామని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా.. కొత్త సినిమా ఒప్పుకోవడం సరైనది కాదని లైకా వెల్లడించింది. తమ సినిమా పూర్తిచేసేవరకు దర్శకుడు శంకర్‏కు స్టే ఇవ్వాలని హైకోర్టును కోరింది.

దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు డైరెక్టర్ శంకర్‏కు కొత్త సినిమాకు దర్శకత్వం వహించకుండా తాము స్టే ఇవ్వలేమని ఉత్తర్వులు తీర్పునిచ్చింది. దీంతో శంకర్, రామ్ చరణ్ సినిమాకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈ సినిమాను జూలైలో సెట్స్ పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

Also Read:

RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. అఫీషియల్‏గా ట్వీట్..

బ్లడ్ క్యాన్సర్‏తో బాధపడుతున్న ప్రముఖ నటి.. ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!