బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ నటి.. ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..
Kirron Kher: ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ బ్లడ్ క్యానర్‌తో బాధపడుతున్నట్లుగా చండిఘడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సూధ్ వెల్లడించారు. బుధవారం
Kirron Kher: ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కిరణ్ ఖేర్ బ్లడ్ క్యానర్‌తో బాధపడుతున్నట్లుగా చండిఘడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సూధ్ వెల్లడించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీఘడ్‌లోని తన ఇంట్లో పడడం వలన ఆమె ఎడమ చేయి విరిగింది. దీంతో ఆమెను చండీఘడ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని. ఈ వ్యాధి ఆమె ఎడమ చేయి నుంచి కుడి భుజానికి వ్యాపించింది. దీంతో ఆమెను చికిత్స కోసం డిసెంబర్ 4న ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు అంటూ చెప్పారు.
ఇక ఈ వార్తలపై ఆమె భర్త అనుపర్ ఖేర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. “ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో కిరణ్ ఖేర్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తున్నాను. అది ఓ రకం బ్లడ్ క్యాన్సర్. ప్రస్తుతం కిరణ్ చికిత్స తీసుకుంటుంది. మునుపటిలా మళ్లి తిరిగివస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. తను చాలా ధైర్యవంతురాలు. ఈ వ్యాధితో పోరాడి తను మాములుగా మారితుంది. ఆమె కోసం మీరు ప్రార్ధిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.
కిరణ్ ఖేర్.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను వివాహం చేసుకుంది. ఆమె 2014లో బీజేపీలో చేరింది. కరణ్ జోహార్, మలైకా అరోరాతోపాటు రియాలిటీ షో ఇండియాస్ గాట్ టాలెంట్‌లో ఆమె జడ్జిగా వ్యవహరించింది.
అనుపమ్ ఖేర్ ట్వీట్..
— Anupam Kher (@AnupamPKher) April 1, 2021