RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. అఫీషియల్‏గా ట్వీట్..

RRR Movie Update: 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) ప్రారంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్‏లో ఇద్దరు

RRR Movie Update: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. అఫీషియల్‏గా ట్వీట్..
RRR Movie Update
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 01, 2021 | 1:50 PM

RRR Movie Update: ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ప్రారంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళీ డైరెక్షన్‏లో ఇద్దరు అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‏తోపాటు.. బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు రోజూరోజుకి పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు ఏ రేంజ్‏లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ మూవీ నుంచి ఏప్రిల్ 2న మరో స్టార్ హీరో అజయ్ దేవ్‎గణ్ లుక్ రివీల్ చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ బిజినెస్ భారీగానే జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్‏ను భారీ మొత్తానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగ ఆ నిర్మాణ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఈ సినిమాను భారీ ధరకు కోనుగోలు చేసిన పెన్ స్టూడియోస్.. నార్త్ ఇండియాలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన బాహుబలిని మించి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన సౌత్ ఇండియన్ బిజినెస్ ఇంకా జరగాల్సి ఉంది. ఈసారి సరికొత్తగా ఇంగ్లీష్ వెర్షన్‏లో ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. అమెరికా, యూరప్ వంటి దేశాలలో దీనిని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

పెన్ స్టూడియోస్ ట్వీట్..

Also Read: బ్లడ్ క్యాన్సర్‏తో బాధపడుతున్న ప్రముఖ నటి.. ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..

Telugu Upcoming Movies April: ఏప్రిల్‏లో సందడి చేయనున్న సినిమాలు ఇవే.. సినీ ప్రియులకు పండగ.. బాక్సాఫీసు కళకళ..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!