Telangana Inter: ప్రాక్టికల్స్ వాయిదా వేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఐపీఈ కంటే ముందే..?
Telangana Inter Practical Examas: ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి జరగనున్నట్లు తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్షలను వాయిదా వేయాలనే ఆలోచనలో
Telangana Inter Practical Examas: గతేడాది యావత్ మానవ సమాజానాన్ని అతలాకుతలం చేసిన కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతకొద్ది రోజుల క్రితం కరోనా మహమ్మారి తోక ముడిచిందని అంతా సంతోషపడేలోపే ఇప్పుడు సెకండ్ వేవ్ పేరుతో మళ్లీ దాడికి దిగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలను మళ్లీ మూసేసింది. ఇక ఈ ప్రభావం పరీక్షలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి జరగనున్నట్లు తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్షలను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం తాత్కాలికంగా విద్యా సంస్థలు మూసి వేయడంతో ఇంటర్ బోర్డ్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7 నుంచి జరగాల్సిన పరీక్షలను 10 నుంచి చేపట్టాలనేది ఒక ఆలోచన కాగా.. ఇంటర్ మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ), జేఈఈ పరీక్ష పూర్తయిన తర్వాతే ప్రాక్టికల్ ఎగ్జామ్ నిర్వహించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇంటర్ ప్రాక్టికల్స్ మే 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డ్ ఈ రెండు మార్గాలను ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై నిపుణులతో చర్చలు జరిపిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుందని సమాచారం. మరి ప్రభుత్వం దేనికి ఓకే చెబుతుందో చూడాలి. Also Read: Kurnool District Collector Office: టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!
TSPSC Notification: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. కీలక ప్రకటన చేసిన టీఎస్‌పీఎస్సీ..
FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?