AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Storie: పట్టపగలు.. అంతా చూస్తుండగా.. ఉరుకులు.. పరుగులు.. సీన్ కట్ చేస్తే…

Mailardevpally Murder: పట్టపగలే ఓ వ్యక్తి ని నడిరోడ్డు మీద నరికి చంపారు. అందరూ చూస్తుండగానే అత్యంత కర్కశంగా కత్తితో పొడిచి చంపాడు దుండగుడు. అసలు ఏం జరుగుతుందో తెలిసే..

Crime Storie: పట్టపగలు.. అంతా చూస్తుండగా.. ఉరుకులు.. పరుగులు.. సీన్ కట్ చేస్తే...
Murder
Sanjay Kasula
|

Updated on: Apr 01, 2021 | 4:44 PM

Share

పట్టపగలే ఓ వ్యక్తి ని నడిరోడ్డు మీద నరికి చంపారు. అందరూ చూస్తుండగానే అత్యంత కర్కశంగా కత్తితో పొడిచి చంపాడు దుండగుడు. అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపే హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించాడు దుండగుడు. దీంతో స్థానిక జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తమ కళ్ల ముందే మర్డర్‌ జరగడంతో వణికిపోయారు.

రాజేంద్రనగర్ డివిజన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ హత్య జరిగింది. అసద్ ఖాన్ అనే వ్యక్తిని కత్తులతో పొడిచి హతమార్చాడు ఓ దుండగుడు. మైలార్‌దేవ్‌పల్లిలోని ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఘటన జరిగింది.

మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్య కేసులో నిందితుడు. దీంతో ప్రత్యర్థులే అసద్ ఖాన్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. అటు క్లూస్ టీమ్‌ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Kendriya Vidyalaya Admission 2021-22: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ చివరి తేదీ ఎప్పుడంటే..!

యాదాద్రి గుట్టల్లో బుసలు కొట్టిన బ్లాక్ మనీ.. ఐటీ సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ

లడ్డూ,పులిహోర తయారీ లెక్కల్లో తేడాలు..చీరల విక్రయాల్లోనూ ఆమ్యామ్యాలు.. లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు