AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

FCI Recruitment 2021: ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2021 | 10:21 AM

Share

FCI Recruitment 2021: ప్రభుత్వరంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్‌ ఇండియా దేశ వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 89 పోస్టులకు గానూ దరఖాస్తులను ఆహ్వానించగా.. ఇవాళే ఆఖరు తేదీ. అసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ (వెబ్‌సైట్ https://fci.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక రాత ప‌రీక్షలో 50శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అయితే ఈ పరీక్ష మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనున్నారు.

ఎఫ్‌సీఐలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే.. మొత్తం 89 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటిలో పలు విభాగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్)‌: 27 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 55శాతం మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ లేదా అగ్రిక‌ల్చర్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 2. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అకౌంట్స్)‌: 22 ఖాళీలు అర్హత: ఐసీఏఐ/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం క‌లిగి ఉండాలి. వయస్సు: 28 ఏళ్ల లోపు ఉండాలి. వయసు: 28 ఏళ్ల లోపు ఉండాలి. 3. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (అడ్మినిస్ట్రేషన్): 30 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ/ పీజీ లేదా త‌త్ససమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయసు: 30 ఏళ్ల లోపు ఉండాలి. 4. మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 2 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత కోర్సులో ఇంట‌ర్న్‌షిష్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభ‌వం ఉండాలి. వయస్సు: 35 ఏళ్ల లోపు ఉండాలి. 5. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (లా): 8 ఖాళీలు అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ప‌నిలో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి. వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి.

జీతం వివరాలు: అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు: రూ.60,000 నుంచి రూ.1,80,000 ఉంటుంది. మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టు‌ల‌కు: రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు రాత ప‌రీక్షలో 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇక ఆన్‌లైన్ ప‌రీక్ష మొత్తం 180 మార్కుల‌కు ఉంటుంది.

Note: పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్ అయిన https://fci.gov.in/ లో చూడవచ్చు.

Also read:

మయన్మార్ సరిహద్దు‌లో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

5G vs 4G: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 5జీ, 4జీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!