AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G vs 4G: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 5జీ, 4జీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

5G vs 4G: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుంది. మనదేశంలోనూ ఇదే పరిస్థితి...

5G vs 4G: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? 5జీ, 4జీ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
5g Vs 4g
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2021 | 7:48 AM

Share

5G vs 4G: ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుంది. మనదేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజుకో కొత్త ఫీచర్లతో ఎలక్ట్రాన్ డివైజ్‌లు మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. దాంతో ప్రజలు సైతం కొత్తగా వచ్చే వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే.. మనదేశంలో ఇప్పటి వరకు 4జీ మేనియా ఉండేది. ఇప్పుడు అది కాస్తా అప్‌గ్రేడ్ అయి 5జీ మేనియా స్టార్ట్ అయ్యింది. కంపెనీలు అన్నీ ఒక్కొక్కొటిగా 5జీ బాట పట్టాయి. ఇప్పటికే పలు కంపెనీలు 5జీ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేశాయి. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రూ. 15,000 నుంచి రూ.20,000 మధ్యే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న 4జీ మొబైల్ ఫోన్లు కూడా ఇంతే ధరకు లభిస్తుండంటంతో ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. 4జీ ఫోన్ కొనాలా? 5జీ ఫోన్ కొనాలా? అనే సందిగ్ధంలో పడిపోతున్నారు. ఇలాంటి సందిగ్ధాన్ని తొలగించేందుకు పలువురు నిపుణులు ఫోన్ కొనుగోలు దారులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఆ సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి 5జీ ఫోన్లలో రెండు రకాలు ఉంటాయి. సబ్-6 గిగాహెర్ట్జ్‌ టెక్నాలజీ కలిగిన ఫోన్లు ఒకటి కాగా, మిల్లీమీటర్ వేవ్‌లెంత్ టెక్నాలజీ కలిగిన ఫోన్లు మరొకటి. ఈ రెండింటిలో నిజమైన 5జీ ఫోన్‌ను అనూభూతి చెందాలంటే మిల్లీమీటర్ వేవ్‌లెంత్‌నే ఉపయోగించాలంటున్నారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో వస్తున్న 5జీ ఫోన్లలో సబ్-6 గిగాహెర్ట్జ్‌ టెక్నాలజీ అందుబాటులోంది. దీనివల్ల 5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అనుభూతి చెందలేం అని నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు.. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. లక్ష పైన ఖర్చు పెట్టి కొనే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లో సైతం సబ్-6 గిగాహెర్ట్జ్ టెక్నాలజీనే ఉందంటున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. దేశంలో 5జీ నెట్‌వర్క్ లాంచ్ అయినప్పటికీ.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారు 2 సంవత్సరాల సమయం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశంలో 5జీ కంప్లీట్‌గా రోల్ అవుట్ అవడానికి చాలా సమయం పడుతుంది. దాంతోపాటు.. 5జీ ప్లాన్ల ధరలు అధికంగే ఉండే ఛాన్స్ ఉండడమే కాకుండా.. డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం దేశంలో 4జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంది. 4జీ డేటా తక్కువ ధరకే అందుబాటులో ఉండటమే కాకుండా.. వేగంగానూ పని చేస్తుంది. పైగా.. అద్భుతమైన ఫీచర్లతో 4జీ ఫోన్లను పలు కంపెనీలు విడుదల చేస్తూనే ఉన్నాయి. కాబట్టి.. ఫీచర్లు, నెట్‌వర్క్, డేటా ప్లాన్స్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త ఫోన్లను కొనుగోలు చేసుకుంటే మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.

Also read:

రామ చిలుకకు అంత్యక్రియలు జరిపిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది ..:Funeral for Parrot Video

Masks compulsory: మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు