New Scam In WhatApp: ఉచితమని క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..? జియో రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత లింక్‌..

New Scam In WhatApp: భారతదేశంలో ఆ మాటకొస్తే యావత్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం..

New Scam In WhatApp: ఉచితమని క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..? జియో రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత లింక్‌..
New Scame In Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 30, 2021 | 6:31 PM

New Scam In WhatApp: భారతదేశంలో ఆ మాటకొస్తే యావత్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంది కాబట్టే ఈ యాప్‌కు అంత ప్రాముఖ్యత లభిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నో ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న వాట్సాప్‌ పలు రకాల మోసాలకు కూడా కేరాఫ్‌గా మారుతోంది. రకరకాల ఆఫర్లతో కూడిన మోసపూరిత ప్రకటనలు ఇటీవల వాట్సాప్‌లో బాగా సర్క్యూలేట్‌ అవుతున్నాయి. యూజర్లు కూడా వెనకా ముందు చూసుకోకుండా ఇలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. అయితే ఈ ప్రకటనల చాటున పెద్ద మోసమే జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రకటన వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. జియో రూ.550ల ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోందని.. ఈ ఆఫర్‌ను పొందాలంటే కింది లింక్‌ క్లిక్‌ చేయాలని ఓ సందేశం వస్తోంది. అయితే పొరపాటున ఆ లింక్‌ చేశారో ఇక మీ పని గోవింద అని హెచ్చరిస్తున్నారు సైబర్‌ నిపుణులు. సదరు లింక్‌ క్లిక్‌ చేసిన వెంటనే ఓ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. దీంతో మీ మొబైల్‌ లేదా కంప్యూటర్‌లో ఉన్న పూర్తి సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళిపోతుంది. మీ బ్యాంక్‌ అకౌంట్లకు సంబంధించిన వివరాలతో హ్యాకర్లు మీ ఖాతాలోని డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాట్సాప్‌లలో వచ్చే ఇలాంటి సందేశాలను నమ్మకూడదనేది సైబర్‌ నిపుణుల సూచన.

Also Read: Life on Mars: గ్రహాంతర టూరిజం, అరుణగ్రహంపై మనుషులు నివాసం ఉండేలా ఓ నగరం.. డిజైన్ రెడీ

MI 11 Youth Edition: షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ మొబైల్‌ కెమెరాతో ఏకంగా సినిమా తీయొచ్చు.!

Driverless Tractor: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?