ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!

India Vs England: ఇంగ్లాండ్‌తో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా అద్భుత విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌ను 3-1తో..

  • Ravi Kiran
  • Publish Date - 7:18 pm, Fri, 2 April 21
ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. 'ఇలా ఆడటం ఇదే చివరిసారి' అంటూ వార్నింగ్.!
Virat Kohli Ben Stokes

India Vs England: ఇంగ్లాండ్‌తో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా అద్భుత విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌ను 3-1తో.. వన్డే సిరీస్‌ను 2-1తో.. టీ20 సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది టీమిండియా. అయితే తాజాగా ఈ సిరీస్‌పై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఓలి పోప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చెన్నైలో తొలి టెస్ట్ ఆడుతోన్న సమయంలో విరాట్ కోహ్లీ తనను బెదిరించాడని ఆరోపించాడు. విరాట్ కోహ్లీ తరచుగా మైదానంలో తన దూకుడైన స్వభావాన్ని ప్రదర్శిస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచాడు. కానీ పోప్ చెబుతున్న ప్రకారం అయితే.. విరాట్ కోహ్లీ తనను బెదిరించాడని.. తర్వాత మ్యాచ్‌లు నువ్వు ఎలా ఆడతావో నేను చూస్తానంటూ’ వార్నింగ్ ఇచ్చాడని తెలిపాడు.

ఈ సంఘటన మొదటి టెస్టు సమయంలో జరిగింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పోప్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ”నువ్వు ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం ఇదే చివరిసారి అవుతుందని” భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దగ్గరకు వచ్చి బెదిరించాడని తెలిపాడు.

విరాట్ నా దగ్గరకు వచ్చి…

రెండో ఇన్నింగ్స్‌లో మా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ నా దగ్గరకు వచ్చాడు. ”ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం ఇది మీకు చివరిసారి” అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడే అర్ధమైంది. ఆ తర్వాత నుంచి సిరీస్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అవుతుందనుకున్నాను. ఇక అదే జరిగిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఏ మ్యాచ్‌లోనూ కోలుకోలేదు. తక్కువ స్కోర్లకే ఆలౌట్ అయింది. కాగా, 23 ఏళ్ల పోప్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!