IPL 2021: ధోనిపైనే భారం.. మళ్లీ టైటిల్‌పై గురి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. కుర్రాళ్లు అదరగొడతారా.?

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. మూడు సార్లు టైటిల్‌ను ఎగరేసుకునిపోయిన ఈ జట్టు..

IPL 2021: ధోనిపైనే భారం.. మళ్లీ టైటిల్‌పై గురి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. కుర్రాళ్లు అదరగొడతారా.?
Follow us

|

Updated on: Apr 02, 2021 | 8:31 PM

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. మూడు సార్లు టైటిల్‌ను ఎగరేసుకునిపోయిన ఈ జట్టు.. ఐదుసార్లు రన్నరప్‌గా. 11లో 10 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. కీలక ప్లేయర్స్ కూడా జట్టుకు దూరం కావడంతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ చేదు అనుభవాలతో ధోని అండ్ గ్యాంగ్ ఐపీఎల్ 2021కు సిద్దం అవుతున్నారు. గత సంవత్సరం చెత్త ఆటను మర్చిపోయే రీతిలో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనను ఇవ్వాలని చెన్నై జట్టు ఉవ్విళ్ళూరుతోంది. ఈ జట్టు తమ పోరును ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించనుంది.

సీఎస్‌కే బలాల గురించి ఒకసారి పరిశీలిస్తే.. జట్టు క్లిష్ట పరిస్థితులలో ఉన్నా ఒడ్డుకు తీసుకొచ్చే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. అలాగే ధోని స్ఫూర్తిదాయక నాయకత్వం కూడా జట్టును ఎన్నో విజయాల వైపు నడిపించింది. చిన్న తలా సురేష్ రైనా తిరిగి రావడం చెన్నైకి సానుకూలంశం కాగా.. ఫాఫ్ డుప్లెసిస్, ధోని, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్, మొయిన్ అలీ, రితురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లతో అటు మిడిల్ ఆర్డర్.. ఇటు ఓపెనింగ్ చాలా బలంగా ఉంది. ఇక సీఎస్కే‌కు ప్రధాన బలం బౌలింగ్ ఎటాక్. లుంగి ఎన్గిడి, శార్దుల్ ఠాకూర్, సామ్ కరన్, ఇమ్రాన్ తాహిర్, జడేజా, దీపక్ చాహర్ వంటి మేటి బౌలర్లు ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ రికార్డులు…

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక స్కోరు 246 పరుగులు. ఇది 2010 లో రాజస్థాన్ రాయల్స్‌పై చేశారు. అదే సమయంలో, ఐపీఎల్ 2013లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన 100 పరుగులు అత్యల్ప స్కోరు. చెన్నై తరఫున సురేష్ రైనా అత్యధిక పరుగులు చేయగా, డ్వేన్ బ్రావో అత్యధిక వికెట్లు తీశాడు. చెన్నై ఇప్పటివరకు 179 మ్యాచ్‌లు ఆడి 106 గెలిచి 71 ఓడిపోయింది. జట్టులో ఒక మ్యాచ్ మాత్రమే ఇప్పటివరకు సమం చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..

మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), సురేష్ రైనా, అంబతి రాయుడు, కెఎమ్ ఆసిఫ్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో, ఫాఫ్ డు ప్లెసీ, ఇమ్రాన్ తాహిర్, ఎన్ జగదీషన్, కర్న్ శర్మ, లుంగీ ఎన్గిడి, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, రితురాజ్ గైక్ సామ్ కరణ్, ఆర్ సాయి కిషోర్, మొయిన్ అలీ, కె గౌతమ్, చేతేశ్వర్ పూజారా, హరిశంకర్ రెడ్డి, భగత్ వర్మ, సి హరి నిశాంత్.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు