IPL 2021: ఐపీఎల్ ముంగిట షాకింగ్ న్యూస్.. గ్రౌండ్స్‌మెన్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ.. టెన్షన్‌లో బీసీసీఐ
IPL 2021: ఐపీఎల్ 2012 సీజన్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి మే 30వ తేదీ వరకు ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగనుండగా, ముంబాయి, చెన్నై, బెంగళూరు...
IPL 2021: ఐపీఎల్ 2012 సీజన్ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 9 నుంచి మే 30వ తేదీ వరకు ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగనుండగా, ముంబాయి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్ సిటీలు మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే టోర్నీ ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో చెపాక్ స్టేడియంలో జరుగనుండగా, రెండో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 10న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కొనసాగనుంది.
అయితే తాజాగా వాంఖడే స్టేడియంలోని 8 మందికి గ్రౌండ్స్‌మెన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో చెన్నై, ఢిల్లీ మధ్య ఏప్రిల్ 10వ తేదీన మ్యాచ్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్ మొత్తాన్ని బయో-సెక్యూర్ బబుల్ వాతావరణంలో నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. వాంఖడే స్టేడియంలో మొత్తం 19 మంది గ్రౌండ్స్‌మెన్ పని చేస్తుండగా, ఇందులో ఏకంగా 8 మంది కరోనా పాజిటివ్ తేలడంతో ఇప్పుడు బీసీసీఐలో టెన్షన్ మొదలైంది.
కాగా, మార్చి 26న గ్రౌండ్స్‌మెన్‌కి కరోనా పరీక్షలు నిర్వహించగా, ముందుగా ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఏప్రిల్ 1న నిర్వహించిన పరీక్షల్లో మరో ఐదుగురు ఈ వైరస్ బారినపడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబాయి క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు పునరాలోచనలో పడిపోయింది. ఇంకెంత మందికి వైరస్ సోకుతుందేమోనన్న ఆందోళనలో ఉంది. ముంబయిలో ఉన్న రెండు క్రికెట్ స్టేడియాల్లో అందుబాటులో ఉన్న గ్రౌండ్స్‌మెన్‌ని తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 19 మంది గ్రౌండ్స్‌మెన్‌లలో 8 మంది ఈ వైరస్ బారినపడటంతో.. స్టేడియం సిబ్బందిలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
IPL: Franchises tightening checks further after groundstaff test positive for COVID-19 at Wankhede
Read @ANI Story | https://t.co/HAvdP4AH1U pic.twitter.com/zwaxo6ajNW
— ANI Digital (@ani_digital) April 3, 2021
ఇవీ చదవండి: IPL 2021: ధోనిపైనే భారం.. మళ్లీ టైటిల్‌పై గురి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. కుర్రాళ్లు అదరగొడతారా.?