Sachin Hit Covid-19 For A Six: కరోనాను సిక్సర్ కొట్టాలి సచిన్.. ట్వీట్ చేసిన పాకిస్తాన్ మాజీ పేస్ బౌల‌ర్ వ‌సీం

Wasim Akram: క్రికెట్ దేవుడు స‌చిన్‌కు కరోనా అని తెలిసిన వెంటనే ప్రపంచ దేశాల క్రికెట్ ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. సచిన్ వెంటనే కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

Sachin Hit Covid-19 For A Six: కరోనాను సిక్సర్ కొట్టాలి సచిన్.. ట్వీట్ చేసిన పాకిస్తాన్ మాజీ పేస్ బౌల‌ర్ వ‌సీం
Sachin
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 02, 2021 | 5:11 PM

క్రికెట్ దేవుడు స‌చిన్‌కు కరోనా అని తెలిసిన వెంటనే ప్రపంచ దేశాల క్రికెట్ ఆటగాళ్లు ఆందోళనకు గురయ్యారు. సచిన్ వెంటనే కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ పేస్ బౌల‌ర్ వ‌సీం అక్ర‌మ్ ట్వీట్ చేశాడు. 16 ఏళ్ల వ‌య‌సులోనే నువ్వు ప్ర‌పంచ అత్యుత్తమ బౌల‌ర్ల‌తో పోరాటం చేసిన యోధుడివి. నువ్వు క‌చ్చితంగా కొవిడ్‌-19ను సిక్స్ కొట్ట‌గ‌ల‌వు అని వ‌సీం అక్ర‌మ్ అన్నాడు.

క‌రోనా సోకిన ఆరు రోజుల త‌ర్వాత తాను వైద్య సిబ్బంది స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు స‌చిన్ చేసిన ట్వీట్‌కు అక్ర‌మ్ బ‌దులిచ్చాడు. నువ్వు కేవ‌లం 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ప్ర‌పంచ అత్యుత్త‌మ బౌల‌ర్ల‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు. అలాగే నువ్వు క‌చ్చితంగా కొవిడ్‌ను సిక్స్ కొట్ట‌గ‌ల‌వు. త్వ‌ర‌గా కోలుకో మాస్ట‌ర్‌.

ఇండియా 2011 వ‌రల్డ్‌క‌ప్ విజ‌యాన్ని నువ్వు డాక్ట‌ర్లు, ఆసుపత్రి సిబ్బందితో జ‌రుపుకుంటావ‌ని ఆశిస్తున్నా. నాకు కూడా ఓ ఫొటో పంపించు అని అక్ర‌మ్ ట్వీట్ చేశాడు. 1990ల్లో వ‌సీం అక్ర‌మ్‌, స‌చిన్ టెండూల్క‌ర్ మ‌ధ్య క్రికెట్ ఫీల్డ్‌లో మంచి పోటీ ఉండేది. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జ‌రిగిన‌ప్పుడ‌ల్లా స‌చిన్‌, వ‌సీంల‌లో ఎవ‌రిది పైచేయి అవుతుందో అన్న ఆస‌క్తి ఇరు దేశాల అభిమానుల్లో క‌నిపించేది. చాలాసార్లు ఈ లెఫ్టామ్ పేస్‌బౌల‌ర్‌పై స‌చిన్‌దే పైచేయిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి: మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

PM Kisan: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి.