PM Kisan: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. దేశంలోని రైతుల తోడ్పాటుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రైతులు

PM Kisan: రైతులు బీ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చాయా ? ఇలా చెక్ చేసుకోండి..
Pm Kisan Samman Nidhi
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 02, 2021 | 5:36 PM

PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. దేశంలోని రైతుల తోడ్పాటుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రైతులు అకౌంట్లలోకి వస్తున్నాయి. ఏప్రిల్ 1నుంచి ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు జమకానున్నాయి. ఈ పథకం కింద రూ.2000 మూడు విడతలుగా రైతుల ఖాతాలోకి చేర్చబడతాయి. అలా మొత్తం రూ.6000 నేరుగా వారి ఖాతాలో పడిపోతాయి. ఇందుకోసం ఈసారి కేంద్రం దాదాపు రూ.11.66 కోట్లును రైతుల ఖాతాలో జమచేస్తోంది.

ప్రభుత్వం మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుండచి నవంబర్ 30 వరకు, మూడవ విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 మధ్య ఇస్తుంది. ఇందులో భాగంగా మొదటి విడత ప్రారంభమైంది. ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాలలో ఎప్పుడైన పడే అవకాశం ఉంది. మీరు పీఎం కిసాన్ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా ? అయితే మీకు కూడా రూ.2000 వస్తాయి. ఇక ఈ పథకంలోని లభ్దిదారుల జాబితాను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇందులో ఉన్న రైతుల ఖాతాలలోకి డబ్బులు పడతాయి. కాబట్టి ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

మీ పేరు చెక్ చేసుకోండిలా..

— ముందుగా మీరు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in ఓపెన్ చేయాలి. — అందులో మీకు Formers Corner (ఫార్మార్స్ కర్నర్) ఆఫ్షన్‏ను సెలక్ట్ చేసుకోవాలి. — ఆ తర్వాత మీకు లభ్దిదారుల జాబిత Beneficiaries List ఆప్షన్ కనిపిస్తుంది. — ఆ జాబితాలో మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేర్లను సెలక్ట్ చేసుకోవాలి. — ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. ఇక అనంతరం మీకు పూర్తి లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.

విడతల పద్ధతులను తెలుసుకోండిలా..

— మీ పేరు జాబితాలో ఉంటే మీ విడతల స్థితిని తెలుసుకోవచ్చు. — ముందుగా వెబ్ సైట్ లోని ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. — ఆ తర్వాత లబ్ధిదారుల స్థితి Beneficiary Status పై క్లిక్ చేయాలి. — వెంటనే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. — అనంతరం మీకు విడతల స్టేటస్ కనిపిస్తుంది.

ఒక వేళ మీరు పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయి లేకపోతే ఇలా చేసుకోండి.. మీరు ఒకవేళ పీఎం కిసాన్ పథకంలో నమోదు చేయకపోయి ఉంటే వెంటనే రిజిస్టర్ అవ్వండి. లేదంటే మీకు రూ.6000 అందవు. ఈ పథకంలో భాగమవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కేవలం ఇంట్లో ఉండి మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం మీ వ్యవసాయ అకౌంట్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉండాలి.

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in ఓపెన్ చేయాలి. * ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ సెలక్ట్ చేయాలి. * ఇప్పుడు మీరు న్యూ ఫార్మర్ రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. * అనంతరం మీ ఆధార్ నెంబర్ క్లిక్ చేయాలి. * వెంటనే కాప్చా కోడ్ నమోదు చేయడం ద్వారా మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. * అనంతరం మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. * అలాగే బ్యాంక్ అకౌంట్, వివరాలు, పొలానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. * వీటి తర్వాత ఫారమ్ సబ్మిట్ చేయాలి.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి స్పెషల్ సర్‏ఫ్రైజ్ వచ్చేసింది.. పవర్‏ఫుల్ లుక్‏లో అజయ్ దేవ్‏గణ్..

కోవిడ్ టీకా తీసుకున్న బాలీవుడ్ స్టార్ అమితాబ్… ప్రస్తుతం బాగనే ఉన్నాను.. ట్వీట్ చేసిన బిగ్ బీ..

పాము విషం ప్రాణాలు తీయడమే కాదు.. రక్షిస్తుంది కూడా.! అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు.!!