పాము విషం ప్రాణాలు తీయడమే కాదు.. రక్షిస్తుంది కూడా.! అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు.!!
Poisonous Snake Venom: పాము పేరు వింటేనే చాలామందికి భయం పుడుతుంది. వాటిని దగ్గరగా చూస్తే.. ఇక అంతే నోట మాటే రాదు.! ప్రపంచంలో..
Poisonous Snake Venom: పాము పేరు వింటేనే చాలామందికి భయం పుడుతుంది. వాటిని దగ్గరగా చూస్తే.. ఇక అంతే నోట మాటే రాదు.! ప్రపంచంలో ఎన్నో రకాల విషపూరితమైన పాములు ఉన్న సంగతి తెలిసిందే. వాటి విషం మనుషులను క్షణాల్లో చంపేస్తుంది. అయితే మీకు తెలియని మరో నిజం ఏంటంటే.? ఆ విషంతో మనిషి ప్రాణాలను సైతం కాపాడవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఒడిశాలో లీటరు విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలిసులు…
ఒడిశాలో అటవీ అధికారులు కోటి రూపాయల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు.నిందితుల నుంచి ఒక లీటర్ పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇది ఓ పెద్ద స్మగ్లింగ్ రాకెట్ అని వారు చెప్పారు. ఒక్కొక్కటి 5 మిల్లీ లీటర్ల అయిదు వైల్స్ ను వీరి వద్ద కనుగొన్నామని అన్నారు.
బాలాసోర్‌కు చెందిన ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు దీన్ని 10 లక్షల రూపాయలకు అమ్మజూపారని, కానీ ఇది అంతర్జాతీయ మార్కెట్ లో కోటి రూపాయల విలువ చేస్తుందని వారు అన్నారు. ఒక లీటర్ విషాన్ని సేకరించాలంటే 200 కోబ్రాలు అవసరమవుతాయని మిశ్రా అనే అధికారి తెలిపారు.వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అనుసరించి నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, వీరిని రేపు కోర్టులో హాజరు పరుస్తామని ఆయన అన్నారు. ఒడిశాలో ఈ రాకెట్‌తో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందొ కనుగొంటున్నామన్నారు.
మార్కెట్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ…
అసలు పాము విషానికి మార్కెట్‌లో ఎందుకంత డిమాండ్.? దానికున్న ప్రత్యేకత ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానం ఇదే. పాము విషం ప్రాణాలు తీయడానికి మాత్రమే కాదు.. ప్రాణాలు కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్ని రకాల మందుల్లోనూ దీన్ని వినియోగిస్తారట. ఇప్పటికే పలువురు రీసెర్చర్లు ఇందుకు సంబంధించి ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి ప్రాణం తీసే పాము విషమే మనిషి ప్రాణ రక్షణ మందుగా కూడా పని చేస్తుందంటే నమ్మలేం. కానీ ల్యాబ్‌లలో రోజూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పాము విషం ఒక లీటర్ కోటి రూపాయలు విలువ చేస్తుందని అటవీశాఖాధికారులు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.
మరిన్ని ఇక్కడ చదవండి:
ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!
ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!