మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

మీ ఇంట్లో గోడమీద బల్లుందా.. మీ ఇంట్లో పిల్లి ఉందా.. ఏవీఎస్ వేసిన బెస్ట్ కామెడీ డైలాగ్ గుర్తుందా.. అయితే ఆ బల్లి నిజంగా ఉంటే ఏం చేయాలో ఓసారి చూద్దాం..

  • Sanjay Kasula
  • Publish Date - 2:14 pm, Fri, 2 April 21
మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!
Lizard Can Be Away From You

మన ఇంటిని శుభ్రంగా, చక్కగా నిర్వహించాలని మనమంతా కలలు కంటున్నాం. అయితే, ఇది అంత సులభం కాదు. బిజీగా ఉండే జీవనశైలి షెడ్యూల్‌తో మనలో చాలా మంది తరచుగా ఇంటి శుభ్రపరచడం చేయలేకపోతున్నాం. దీనివల్ల ఇంట్లో చాలా చోట్ల అపరిశుభ్రంగా మారి కీటకాలకు, బల్లులు వచ్చి చేరుతాయి.

హౌస్ బల్లులను హౌస్ జికోస్ అంటారు. అవి ఎవరికి హానిచేయవు.. విషపూరితం కూడా కావు.., కానీ వాటిని చూస్తే మాత్రం భయపడిపోతాం. అందుకే వాటిని ఇంటి నుంచి  తరిమివేస్తాం. అవి మన ఇంటిలోపలికి వచ్చిన తర్వాత అంత త్వరగా  ఇంటిని వదిలిపెట్టవు. దీంతో వాటిని వీలైనంత త్వరగా పంపించాలని చాలా మంది అనుకుంటారు. వీటిని వదిలించుకోవడానికి మేము  చెప్పే సాధారణ చిట్కాలను జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది. ఇక చదవండి…!

పెప్పర్ స్ప్రే ఉపయోగించండి

బల్లులను చికాకు పెట్టే వాటిలో నల్ల మిరియాలు స్ప్రే ఒకటి. మీరు ఇంట్లోని బల్లి తిరిగే మూలలో నల్ల మిరియాల పొడిని పిచికారీ చేయవచ్చు. మీరు నల్ల మిరియాలు పొడి బదులు ఎర్ర కారం పొడి కూడా ఉపయోగించవచ్చు.

గుడ్డు పై తొక్క ఉంచండి

ఆ కోడి గుడ్డు పెంకులను పడేయకుండా మీ ఇంటిలోని బల్లులను వదిలించుకోవడానికి ఉపయోగించండి. వాటిని ఒక గుడ్డతో పూర్తిగా తుడిచి, బల్లులు తరచుగా ఉండే ప్రదేశాలలో ఉంచండి. గుడ్లు నుండి వచ్చే వాసనను బల్లులు ఇష్టపడవు.. దీంతో బల్లి మీ ఇంటిని వదిలి పెట్టే అవకాశం ఉంది.

మూలల్లో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ఉంచండి

ఉల్లిపాయ, వెల్లుల్లి రెండూ  ఘాటైన వాసన కలిగి ఉంటాయి. ఇది ఇంటి బల్లులను తరిమికొడుతాయి. బల్లి వదిలించుకోవడానికి మీ ఇంటి మూలలో కొన్ని వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను ఉంచండి. దీనితో ఇవి ఇంటి నుండి పారిపోతారు. భవిష్యత్తులో తిరిగి  ఎంట్రీ ఇవ్వవు.

నాఫ్థలీన్ ఉండలను ఉపయోగించండి

ఎలుకలు, కీటకాల నుండి బట్టలను రక్షించడానికి నాఫ్థలీన్ బంతులను తరచుగా ఉపయోగిస్తారు. బల్లులను వదిలించుకోవడంలో ఇవికూడా ఎఫెక్టూవ్‌గా పనిచేస్తుంటాయి. ఎందుకంటే నాఫ్థలీన్ ఉండల నుంచి వచ్చే తీవ్రమైన వాసనను  అవి  తట్టుకోలేవు.  అంతే కాకుండా కర్పురం బిల్లలను బల్లి తిరిగే ప్రదేశాల్లో పెట్టితే అక్కడికి తిరిగి బల్లి రాదు.

ఇవి కూడా చదవండి : గుర్తుందా.. వినబడుతోందా.. ఆ శబ్ధం.. ధోని సిక్సర్.. విశ్వవిజేతగా టీమిండియా.. ఆ అద్భుతానికి సరిగ్గా పదేళ్లు..

MS Dhoni IPL 2021: సిక్సర్ల తలైవా.. కింగ్ ఆఫ్ ఐపీఎల్… ఎంఎస్ ధోనీ రికార్డుల హిస్టరీని ఓ సారి చూద్దాం..

ఒకరు కాదు ఇద్దరు కాదు..వందల మందిని మడతపెట్టేసిన కిలాడీ.. హానీ ట్రాప్ కేసులో ఎవరా లేడీ..! ఇదే ఇప్పుడు సస్పెన్స్