Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H1-B visa ban expire: హెచ్1 బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయంతో లాభం ఏమిటో తెలుసా?

ప్రతి ఏటా అమెరికా 85వేల హెచ్1 బి వీసాలు జారీచేస్తుంది. వాటిలో 70 శాతం భారతీయులకే ఉపయోగపడుతున్నాయి.

H1-B visa ban expire: హెచ్1 బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయంతో లాభం ఏమిటో తెలుసా?
H1 B Visa Ban Expire
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 02, 2021 | 3:48 PM

H1-B visa ban expire: భారతదేశ ఐటీ ప్రొఫెషనల్స్ కి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుభవార్త అందించారు. గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న హెచ్-1 బి వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.

భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం మేలు చేసే నిర్ణయమని చెప్పవచ్చు.  గత జూన్ లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా తీసుకున్న వీసాల పై నిషేధ నిర్ణయం ఎన్నో విమర్శల పాలైంది. అయినా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ట్రంప్ అంగీకరించలేదు.

హెచ్-1 బి వీసా అంటే ఏమిటి?

నం ఇమిగ్రెంట్ వీసాగా పేర్కొనే హెచ్-1బి వీసా ద్వారా అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులు, లేదా వర్కర్లను తమ కంపెనీల్లోకి విధుల్లోకి తీసుకునే అవకాశం కల్పిస్తుంది.

అదేవిధంగా ఎల్-1 వీసా విధానంలో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఉపాధి కల్పించే అవకాశాన్ని కంపెనీలు ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. అమెరికా ప్రతి ఏటా 85,000 హెచ్ -1 బి వీసాలు జారీ చేస్తుంది. వీటిలో దాదాపు 70 శాతం భారతీయ నిపుణులకు ఉపయోగపడుతున్నాయి.

ట్రంప్ సర్కారు చేసిందేమిటి..

ట్రంప్ నేతృత్వంలో జూన్ 2020లో హెచ్ 1 బి వీసాలపై నిషేధం విధించారు. ఈ సంవత్సరం మార్చి 31 వరకూ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ఉధృతిని కారణంగా చూపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ నిర్ణయాన్ని మెజార్టీ దేశాలు.. అమెరికాలోని ఆర్ధిక నిపుణులు తీవ్రంగా నిరసించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా సీఈవో ఎలీన్ మస్క్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

ఇప్పుడు బైడెన్ ఏం చేశారు?

ఎన్నికల సమయంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాము అధికారంలోకి వస్తే హెచ్ 1 బి వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకుంటూ వీసాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.

ఈ నిషేధం ఎత్తివేతతో నిషేధానికి ముందు వీసాల కోసం చేసుకున్న దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారు. అంటే..ఈ వీసాలపై ఇంటర్వ్యూలకు హాజరు అయినా లేదా ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్ ఇచ్చినా వాటిని ముందుగా ప్రాసెస్ చేసి పని పూర్తి చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అదేవిధంగా వీసా నిబంధనల కారణంగా గతంలో తిరస్కరణకు గురైన 10052 వీసా దాఖాస్తుదారులకు తిరిగి వీసాకు కొత్తగా ఫీజుతో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

భారతీయ ఐటీ నిపుణులకు దీనివలన ఉపయోగం ఏమిటి?

ముందే చెప్పినట్టు దాదాపుగా 70 శాతం హెచ్1 బి వీసాలు భారతీయులకే ఉపయోగపడుతున్నాయి. దీనితో భారతీయ ఐటీ నిపుణులకు మేలు కలుగుతుంది. అమెరికాలోని ఐటీ కంపెనీలలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తూ..నిషేధం కారణంగా ఉపాధి కోల్పోయినవారికి తిరిగి అవకాశం దక్కుతుంది. అటు కంపెనీలకు కూడా తక్కువ ఖర్చుతో నిపుణులను సమకూర్చుకునే అవకాశం కుదురుతుంది.

Also Read: H-1B Visa: హెచ్-1బీ వీసాపై ముగిసిన నిషేధం.. భారతీయులకు భారీ ఊరట.. నిషేధాన్ని పొడిగించబోమన్న బైడెన్‌..!

America Joe Biden: భారీ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. మరో కీలక ప్రతిపాదన