H1b Visa: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్.. ఆ నిషేధం ఇకపై లేదు..
H1b Visa: అమెరికాలో ఐటీ సంబంధిత ఉద్యోగాలు చేసే భారతీయులకు హెచ్-1బీ వీసా ఎంతో కీలకమైంది. ఈ వీసా జారీపై ఆ దేశ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు..
H1b Visa: అమెరికాలో ఐటీ సంబంధిత ఉద్యోగాలు చేసే భారతీయులకు హెచ్-1బీ వీసా ఎంతో కీలకమైంది. ఈ వీసా జారీపై ఆ దేశ అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు భారతీయులను కలవర పెడుతుంటాయి. ఎందుకంటే అమెరికాలో ఎక్కువ సంఖ్యలో హెచ్-1బీపై ఆధారపడే వారు భారతీయులే ఉంటారు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య కాస్త ఎక్కువేనని చెప్పాలి. హెచ్-1బీ వీసా అమెరికన్ కంపెనీలకు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ సహా ఇతర నాన్-ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాలపై గతేడాది జూన్‌లో నిషేధం విధించారు. ఇక జూన్ తర్వాత కూడా ఈ నిషేధాన్ని 2021 మార్చి 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే కొత్తగా అధ్యక్ష పీఠం ఎక్కిన జో బైడెన్ మాత్రం ఈ నిషేధాన్ని పొడగించలేదు. దీంతో బుధవారంతో హెచ్-1బీపై ఉన్న నిషేధం అధికారికంగా ఎత్తివేసినట్లు అయ్యింది. వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. గతంలో ట్రంప్ సర్కారు నిషేధాన్ని పెంచుతూ రాగా.. తాజాగా బైడెన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అమెరికన్ సంస్థలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే గత హయాంలో పదవీ వీడే ముందు ట్రంప్ తీసుకున్న ఎన్నో వివాస్పద నిర్ణయాలను జోబైడెన్ ఉపసంహరించుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే.
Also Read: student suicide in canada: కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య.. భవనంపై నుంచి దూకి బలవన్మరణం..!
మరోసారి కాల్పులమోతతో దద్దరిల్లిన కాలిఫోర్నియా.. చిన్నారితోసహా నలుగురు వ్యక్తులు దుర్మరణం
Donald Trump: బౌద్ధ దుస్తులతో ధ్యానంలో ట్రంప్.. చైనాలో అమెరికా మాజీ అధ్యక్షుడి విగ్రహాల జోరు!