America Joe Biden: భారీ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరో కీలక ప్రతిపాదన
America Joe Biden: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు.
America Joe Biden: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవలే 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని తీసుకువచ్చారు. అది కూడా అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ భారీ ఉద్దీపన ప్యాకేజీని తీసుకొచ్చి ఉభయ సభల్లో గెలిపించుకోవడం విశేషం. తాజాగా బైడెన్ మరో భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ సారి మౌలిక సదుపాయల రంగానికి ప్రయోజనం చేకూర్చే భారీ ప్యాకేజీని బుధవారం ప్రకటించారు. వచ్చే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
దీనిని ఒక తరంలో ఒకసారి వెచ్చించే పెట్టుబడిగా అధ్యక్షుడు పేర్కొన్నారు. అలాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశంలో అతిపెద్ద ఉద్యోగాల కల్పన పెట్టుబడి కూడా ఇదేనని బైడెన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా సుమారు 621 మిలియన్ డాలర్లు రవాణా రంగం అభివృద్ధికి (వంతెనలు, రహదారులు, రోడ్ల పునరుద్దరణ, విమానాశ్రయాల అభివృద్ధి, విద్యుత్ వాహనాలకు) వినియోగించనున్నట్లు చెప్పారు. అలాగే 400 బిలియన్ డాలర్లు వృద్ధులు, వికలాంగ అమెరికన్ల సంరక్షణకు కేటాయించారు. మరో 300 బిలియన్ డాలర్లు తాగునీటి మౌలిక సదుపాయాలు, బ్రాడ్‌బ్యాండ్ యాక్సెస్‌ను విస్తరించడం, ఎలక్ట్రిక్ గ్రిడ్‌లను అప్‌గ్రేడ్ చేయడం లాంటి వాటికి ఉపయోగించనున్నట్లు వెల్లడించారు.
బైడెన్ కీలక ప్రతిపాదన
ఈ సందర్భంగా జో బైడెన్ కీలక ప్రతిపాదన చేశారు. కార్పొరేషన్ పన్నును 21 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: వంట గదిలో భారీ శబ్దం.. వెళ్లి చూసే సరికి పేలిన వాషింగ్ మెషన్.
Bharat Biotech’s Covaxin: భారత్ బయోటెక్.. కోవాక్సిన్‌ను నిరాకరించిన బ్రెజిల్.. ఎందుకంటే..?