Injured Shreyes: భుజం గాయంకు సర్జరీ.. శ్రేయస్​ అయ్యర్​కు నాలుగు నెలల విశ్రాంతి..

భుజం గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమైన శ్రేయస్​ అయ్యర్​కు.. ఏప్రిల్​ 8న సర్జరీ  చేయనున్నారు. గత నెల 23న ఇంగ్లాండ్​తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు..

Injured Shreyes: భుజం గాయంకు సర్జరీ.. శ్రేయస్​ అయ్యర్​కు నాలుగు నెలల విశ్రాంతి..
Shreyas Iyer
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 02, 2021 | 10:26 PM

భుజం గాయం కారణంగా ఐపీఎల్​కు దూరమైన శ్రేయస్​ అయ్యర్​కు.. ఏప్రిల్​ 8న సర్జరీ  చేయనున్నారు. గత నెల 23న ఇంగ్లాండ్​తో వన్డే సందర్భంగా గాయపడ్డాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. భుజం గాయంతో బాధ పడుతున్న శ్రేయస్​ అయ్యర్​కు ఏప్రిల్ 8న శస్త్రచికిత్స నిర్వహించనున్నారు.

మార్చి 23న పుణె వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్​ గాయపడ్డాడు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లిష్​ కౌంటీల్లో లాంక్​షైర్​ తరఫున ఆడనున్నాడు శ్రేయస్​. కానీ, సర్జరీ తర్వాత నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉండాల్సి ఉంది. ఈ నెలల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లుగా తెలుస్తుంది.

దీంతో కౌంటీల్లో నుంచి కూడా అయ్యర్ తప్పుకోనున్నాడు. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ (DC)కు కెప్టెన్​గా వ్యవహరించిన అయ్యర్​.. గాయం కారణంగా లీగ్​కు దూరమయ్యాడు. అతని స్థానంలో రిషభ్ పంత్​ను సారథిగా నియమించింది డీసీ.

ఇవి కూడా చదవండి: Sachin Hit Covid-19 For A Six: కరోనాను సిక్సర్ కొట్టాలి సచిన్.. ట్వీట్ చేసిన పాకిస్తాన్ మాజీ పేస్ బౌల‌ర్ వ‌సీం

Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు