Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్9 న

Pawan Kalyan : పవన్ డేడికేషన్ కు ఫిదా అవుతున్న అభిమానులు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 6:39 PM

Pawan Kalyan  : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పవన్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏప్రిల్9న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ లాయర్ గా కనిపించనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అంజలి, నివేద థామస్, అనన్య నటిస్తున్నారు. శ్రుతిహాసన్ పవన్ కు జోడీగా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తుంది. మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఈ సినిమాతోపాటు క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొఘలాయుల కాలం నాటి కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసం క్రిష్ ఇప్పటికే భారీ సెట్ లను కూడా నిర్మించాడని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకున్నాడు పవన్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ చాలా కష్టపడుతున్నడని తెలుస్తుంది. పవన్ యాక్షన్ సీన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోలో పవన్ డెడికేషన్ చూసి పవన్ అభిమానులు సంబరపడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thalaivi Movie: తలైవి సినిమా నుంచి వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..

వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్… చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్