Thalaivi Movie: తలైవి సినిమా నుంచి వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..

బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి . దివంగత నటి ,రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగన జయలలిత

Thalaivi Movie: తలైవి సినిమా నుంచి  వీడియో సాంగ్ .. ఆకట్టుకుంటున్న పాట..
Kangana
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 5:20 PM

Thalaivi Movie: బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం తలైవి . దివంగత నటి ,రాజకీయనాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగన జయలలిత పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రల్లో నటిస్తుండగా.. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమానుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈ సినిమాను విబ్రీ మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ‘తలైవి’ సినిమాను ఏప్రిల్ 23న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఇక శుక్రవారం ఈ సినిమాలో నుండి ‘ఇలా ఇలా’ అనే వీడియో సాంగ్ స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు. పాటలో కంగన రెట్రో అండ్ మోడర్న్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ‘తలైవి’ సినిమాను ఏప్రిల్ 23న తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాష్ కుమార్ అందించారు.