AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Tarun Kumar: త్వరలో టాలీవుడ్‌లో మరో హీరో ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు ..

Actor Tarun Kumar:తల్లిదండ్రుల బాటలోనే నడిచాడు ఆ హీరో.. బాల్యంలో నటుడుగా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం..

Actor Tarun Kumar: త్వరలో టాలీవుడ్‌లో మరో హీరో ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు ..
Actor Tarun
Surya Kala
|

Updated on: Apr 02, 2021 | 3:54 PM

Share

Actor Tarun Kumar: తల్లిదండ్రుల బాటలోనే నడిచాడు ఆ హీరో.. బాల్యంలో నటుడుగా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కొన్ని హిట్స్ తర్వాత సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు తరుణ్.

అలనాటి నటి.. డబ్బింగ్ ఆర్టిస్టు రోజా రమణి, చక్రపాణి దంపతుల తనయుడు తరుణ్ కుమార్. అంజలి, తేజ, సూర్య ఐపీఎస్, ఆదిత్య 369 వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నువ్వే కావాలి మూవీతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండస్ట్రీలో అసలైన లవర్ బాయ్ గా గుర్తింపు పొంది అమ్మాయిల పాలిట కలల రాకుమారుడిగా వెలుగొందాడు. ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకెళ్లాడు. వరుస హిట్స్ అందుకున్నతరుణ్ ని ఆతర్వాత వరుస పరాజయాలు వెంటాడడంతో గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్న 37 ఏళ్ల తరుణ్ మోస్ట్ వాల్యుబుల్ బ్యాచిలర్. తరుణ్ పెళ్లి కోసం అమ్మ రోజా రమణీ పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నట్లు టాక్. గతంలో ఒకటి రెండు సార్లు అమ్మాయి దొరికేసింది.. త్వరలో పెళ్లి అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే మళ్ళీ ఇపుడు తరుణ్ కు జోడీ దొరికిందనే టాక్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

ఓ స్నేహితురాలి కూతుర్ని తరుణ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని రోజా రమణి నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదే పెళ్లి అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తరుణ్ పెళ్లి పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read:  ఈజీగా బరువు తగ్గాలనుకుంటున్నారా..! అయితే ఈ ఆకుకూరని ట్రై చేయండి పోషకాల నిలయం పుట్టగొడుగులు.. ఆంధ్ర స్టైల్ లో మష్రూమ్స్ మాంసాల కూర తయారీ విధానం..