వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్… చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్

టాలీవుడ్‌లో ఇప్పటికే చాలమంది కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్‌ అయ్యారు. కామెడీ టైమింగ్‌ తో పాటు తమలో హీరోయిజం కూడా ఉందని ఇప్పటికే చాలమంది నిరుపించుకున్నరు.

వివాహ భోజనంబు సినిమానుంచి లిరికల్ సాంగ్... చౌరస్తా రామ్ అలపించిన మరో క్రేజీ సాంగ్
Vivaha Bhojanambu 1
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2021 | 4:00 PM

Vivaha Bhojanambu : టాలీవుడ్‌లో ఇప్పటికే చాలమంది కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్‌ అయ్యారు. కామెడీ టైమింగ్‌ తో పాటు తమలో హీరోయిజం కూడా ఉందని ఇప్పటికే చాలమంది నిరుపించుకున్నరు. అలీ, సునీల్‌, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు హీరోలుగా సినిమాలు చేసి ఆకట్టుకున్నరు. తాజాగా సత్యకూడా హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకొనున్నాడు.

సత్య ప్రధాన పాత్రలో వివాహభోజనంబు అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ దగ్గర నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్‌ చేసింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ నిర్మిస్తున్న ఈ సినిమా వెంకటాద్రి టాకీస్ బ్యానర్‌ లో రానుంది. అయితే సందీప్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వివాహ భోజనంబు అనే పేరుతో రెస్టారెంట్లుకూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ప్రతిష్టాత్మక ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత.. నిర్మాత పి కిరణ్ (జెమిని కిరణ్) సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్‌ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. సేవింగ్స్ అంటే క్రేజీ సేవింగే చేయని సన్నాసి.. అండర్ వేర్ బయటకు వేసే సూపర్ మేన్ అంట.. హోటల్ బిల్ టోటల్ గా కట్టడు అంట అంటూ సాగే క్రేజీ పదాలతో సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అనిరుధ్ విజయ్  సంగీతం అందించగా.. చౌరస్తా రామ్ ఈ పాటను అలపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి. 

దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

ఆ హీరోయిన్‏కు రెండు గుడ్‏న్యూస్‏లు.. సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగార్జున హీరోయిన్..

రిషబ్ పంత్‏తో రిలేషన్‏షిప్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. అసలు మ్యాటర్‏ను రివీల్ చేసిన..