AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమెషనల్‏గా ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం టీం’.. సీతారాములుగా వంటలక్క, డాక్టర్ బాబు అధుర్స్.. రామాయణ గాథతో..

'కార్తీక దీపం' సీరియల్ టెలివిజన్ చరిత్రలోనే రికార్డులు సృష్టిస్తున్న సీరియల్. ఏ సీరియల్ నటీనటులకు లేని క్రేజ్.. వంటలక్క, డాక్టర్ బాబులకు

ఎమెషనల్‏గా ఆకట్టుకుంటున్న 'కార్తీకదీపం టీం'.. సీతారాములుగా వంటలక్క, డాక్టర్ బాబు అధుర్స్.. రామాయణ గాథతో..
Karthika Deepam
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2021 | 5:53 PM

Share

‘కార్తీక దీపం’ సీరియల్ టెలివిజన్ చరిత్రలోనే రికార్డులు సృష్టిస్తున్న సీరియల్. ఏ సీరియల్ నటీనటులకు లేని క్రేజ్.. వంటలక్క, డాక్టర్ బాబులకు సొంతం. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్‏లు తమ నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ సీరియల్‏లో ప్రతి పాత్రకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఈ సీరియల్ తాజాగా వెయ్యి ఎపిసోడ్‏లు పూర్తిచేసుకున్న కానీ.. టెలివిజన్ రేటింగ్‏లో టాప్‏లో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ సీరియల్‏ను ఇంకా ఏ సీరియల్ బీట్ చేయలేకపోయింది. అగ్రహీరోల సినిమాలను సైతం వెనక్కు నెట్టి నిర్విరామంగా కొనసాగుతుంది ‘కార్తీక దీపం’. ఎప్పుడూ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తూ.. ఎమోషనల్ సెంటిమెంట్‏తో కట్టిపడేస్తున్న కార్తీక దీపం టీం.. ఈసారి రామాయణ గాథతో ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

పండుగలకు ఎప్పుడు స్పెషల్ ఈవెంట్స్ చేసే బుల్లితెర ఛానల్ స్టార్ మా ఈసారి ఉగాదికి కూడా సరికొత్తగా మా ఉగాది వేడుక అనే పేరుతో ఈవెంట్ చేస్తున్నారు. అందులో పలు సీరియల్స్ నటీనటులు విభిన్న స్క్రిప్ట్స్ చేస్తూ.. ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో డాక్టర్ బాబు రాముడిగా, వంటలక్క సీతగా, పిల్లలు సౌర్య, హిమలు లవకుశలుగా కనిపించారు. ఇక మరోసారి వంటలక్క తన అద్బుత నటనతో ఆహా అనిపిస్తుండగా.. రాముడి పాత్రలో నిరుపమ్ జీవించేసారు. ఇక లవకుళలుగా నటిస్తున్న సౌర్య, హిమలు తమ పాత్రలలో ఒదిగిపోయారు. అచ్చం సీతారామ.. లవకుశలుగా కార్తీక దీపం కనుల నిండుగా కనిపించారు. శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అంటూ వచ్చే పాటకు సీతాదేవి పాత్రలో ఉన్న వంటలక్క.. నా ప్రభువు శ్రీరామ చంద్రుడు తప్ప అన్యమెరుగని ఇల్లాలినైతే ఓ మాతా.. భూమాతా నన్ను ఆదరించి నీ ఒడిలో చేర్చుకో అంటూ భూదేవి ఒడిలో చేరే సన్నివేశంలో సీతనే మైమరపించేలా నటించింది మన ప్రేమి విశ్వనాథ్. ఇక తన కూతుళ్ళను పట్టుకొని రాముడిగా ఉన్న డాక్టర్ బాబు కన్నీళ్ళు పెట్టుకునే సీన్ ప్రతి ప్రేక్షకుడిని హత్తుకుందనే చెప్పుకోవాలి. కార్తీక దీపం స్టోరీ కూడా అచ్చం రామాయణ గాథే అనుకోవచ్చు.

Also Read: ఇక పై కనిపించను.. ఒంటరిగానే వెళ్తున్నాను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్..

Vakeel Saab : ‘వకీల్ సాబ్‏’కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో ప్రీరిలీజ్ ఈవెంట్..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!