`వైల్డ్‌డాగ్` ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది – కింగ్ నాగార్జున

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా

`వైల్డ్‌డాగ్` ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది - కింగ్ నాగార్జున
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2021 | 3:26 PM

కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని ‌మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో స‌క్సెస్ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కింగ్ నాగార్జున మాట్లాడుతూ – ‘‘నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు అన్నారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమా రిలీజ్‌ చేయాలా? ఆడియన్స్‌ వస్తారా? అనుకున్నాం. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల సపోర్ట్ త‌ప్ప‌కుండా ఉంటుందని మరోసారి నిరూపితమైందని నాగ్ అన్నారు.

కలెక్షన్స్‌ బాగున్నాయని నిర్మా త నిరంజ‌న్‌గారు చెప్పడం చాలా సంతోషంగా ఉందని. నన్ను ప్రొత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే నేను కొత్తరకం సినిమాలు చేయగలగుతున్నానని అన్నారు. అలాగే ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వ‌చ్చిన బెస్ట్ అప్రిసియేష‌న్‌. చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవ‌స‌ర‌మా అన్నారు. నేను రిస్కులు చేయ‌బ‌ట్టే ఈ స్టాయికి రాగ‌లిగాను. రిస్క్ చేయ‌డం నాకు కొత్తేమి కాదు.. ప్రేమించే ప‌ని చేసిన‌ప్పుడు శ్ర‌మ ఎప్పుడు ఉండ‌దు. ఇంత మంచి అప్లాజ్ వ‌స్తున్నందుకు ద‌ర్శ‌కుడు సాల్మ‌న్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ మంచి స‌పోర్ట్ చేశారు. వారికి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తున్నందుకు హ్యాపీ“ అని నాగ్  అన్నారు.