Viral Video: తినడానికి చూస్తే ఖాళీ గిన్నె దర్శనం. యజమానిమీద కోపంతో శునకం చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరుగా

సాధారణంగా మనుషుల్లానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ప్రస్తుత వీడియోలో ఓ శునకానికి పిచ్చ కోపం వచ్చింది. దాని కోపానికి కారణమేంటంటే..

Viral Video: తినడానికి చూస్తే ఖాళీ గిన్నె దర్శనం. యజమానిమీద కోపంతో శునకం చేసిన పని చూస్తే నవ్వాపుకోలేరుగా
Hungry Dog
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 1:15 PM

Viral Video: సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫన్నీ వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నెటిజన్లు ఎక్కువగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు చూడ్డానికి చాలా ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఓ శునకానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే సాధారణంగా మనుషుల్లానే జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. ప్రస్తుత వీడియోలో ఓ శునకానికి పిచ్చ కోపం వచ్చింది. దాని కోపానికి కారణమేంటంటే.. బాగా ఆకలితో ఉన్న ఈ కుక్క తన యజమాని దగ్గరకు వచ్చి చాలాసేపు అరుస్తుంది. కానీ.. ఆ యజమాని ఎంతకీ పట్టించుకోకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఆ కుక్క ఓ గదిలోకి వెళ్లి ఖాళీ గిన్నెను నోట కరుచుకుని నేలపై విసిరికొట్టి తన కోపాన్ని వ్యక్తం చేసింది.

కాగా, ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ అంగుసామి ఈ వీడియోను వీడియోను ట్వీట్టర్‌లో షేర్‌ చేశాడు. దీనికి ‘నాకు ఆకలి వేసిన 0.5 మెక్రో సెకన్ల తర్వాత’ అని క్యాప్షన్ జోడించారు. టైమ్‌కి ఆహారం పెట్టడం తెలియదా అన్నట్లు ఆ కుక్క కోపంతో ప్లేటును విసిరికొట్టడం అందరికి నవ్వుతెప్పిస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిపై తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత కోపమా? ఆకలైతే అంతే.! అంటూ తదితర కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే లైకులు, రీట్విట్లతో ఈ ఫన్నీ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆకలి ఏ జీవికైనా ఒకటే కదా అనిపిస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:దీపారాధనకు ఉపయోగించే వత్తుల్లో ఎన్నో రకాలు.. ఏ రకం వత్తితో ఏయే ఫలితాలు వస్తాయంటే..!

పరిమళాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే మల్లెలు… కళ్ళకు, మనసుకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో తెలుసా..!