- Telugu News Photo Gallery Spiritual photos Deepam jyoti parabrahma sanskrit benefits of deepamlighting of deepam
Lighting of Deepam: దీపారాధనకు ఉపయోగించే వత్తుల్లో ఎన్నో రకాలు.. ఏ రకం వత్తితో ఏయే ఫలితాలు వస్తాయంటే..!
దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉందని హిందుల నమ్మకం. ఇక దీపాన్ని మహాలక్ష్మీ స్వరూపంగా సంభావించి దేవుని ముందు వెలిగిస్తారు. దీపారాధనలో పత్తిది ముఖ్యమైన పాత్ర. వత్తుల్లో చాలా రకాలున్నాయి. అయితే ఒకొక్క రకం వత్తి ఒకొక్క ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతారు. ..
Updated on: Apr 06, 2021 | 12:54 PM

హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. "దీపం జ్యోతిః పరంబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. చీకటిని చీల్చుకుంటూ కాంతిని ప్రసరింపజేస్తుంది. దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, అందుకనే దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.

సర్వసాధారణంగా దీపారాధనకు రోజు.. ఉపయోగించేది దూది చేసిన వత్తిని. పత్తి తో చేసిన వత్తి తో కూడిన దీపం వెలిగిస్తే.. అదృష్టం కలిసి వస్తుందట.

సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన జిల్లేడు పూలను ఎండబెట్టి.. అనంతరం వాటినుంచి గింజలను తీసుకుని దూది లాంటి పదార్ధంతో వత్తులు చేసి.. దానితో వినాయకుడికి దీపారాధారణ చేస్తే.. ఆరోగ్యంగా జీవిస్తారట.

ఇక లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తామరపువ్వు కాండంతో చేసిన వత్తితో దీపారాధన చేస్తే.. లక్ష్మి, సరస్వతి కటాక్షము లభిస్తాయని నమ్మకం.

వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని అనుకునేవారు పార్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవాలని.. అందుకని అమ్మవారికి పసుపు వస్త్రంతో చేసిన వత్తులతో చేసిన దీపారాధన చేయాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరిగి.. సుఖ సంతోషాలతో జీవిస్తారని పెద్దలు చెబుతారు.




