సుడిగాలి సుధీర్‏ను ఇరికించిన హైపర్ ఆది.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన నాని.. పాపం మళ్లీ బుక్కైన సుధీర్..

ప్రస్తుతం బుల్లితెరపై పండుగలకు స్పెషల్ ఈవెంట్స్ చేయడం కామన్‏గా మారింది. ఇటీవల ఈ స్పెషల్ ఈవెంట్స్‏తో ప్రతి ఛానెల్ల మధ్య పోటీ

  • Rajitha Chanti
  • Publish Date - 9:07 pm, Mon, 5 April 21
సుడిగాలి సుధీర్‏ను ఇరికించిన హైపర్ ఆది.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన నాని.. పాపం మళ్లీ బుక్కైన సుధీర్..
Nani Sudeer

ప్రస్తుతం బుల్లితెరపై పండుగలకు స్పెషల్ ఈవెంట్స్ చేయడం కామన్‏గా మారింది. ఇటీవల ఈ స్పెషల్ ఈవెంట్స్‏తో ప్రతి ఛానెల్ల మధ్య పోటీ ఏర్పడింది. ప్రతి చిన్న పండగ నుంచి ప్రతి చిన్ స్పెషల్ డే వరకు ఈ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. స్టార్ సెలబ్రెటీలను అతిధులుగా ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఉగాది పండుగను పురస్కరించుకోని కొన్ని టెలివిజన్ ఛానళ్లు.. స్పెషల్ ఈవెంట్ ప్రోమోలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈటీవీ ఉగాది జాతి రత్నాలు అనే స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.

ఇందులో సుధీర్, శ్రీముఖి, పూర్ణ, సంగీత, రష్మీ, ఆది అందరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ఈ వేడుకకు నేచరల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా వచ్చారు. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ఈ వేడుకలో పాల్గోన్నారు నాని. ఇక ఈ వేడుకలో ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం అంటూ ఆరు రకాల గురించి చెప్పుకొచ్చారు. ఇందులో కమెడియన్స్, యాక్టర్స్, యాంకర్స్, డ్యాన్సర్స్, సోషల్ మీడియా స్టార్స్ అంటూ అందరి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో ఒక్కొక్కరిని ఒక్కో రుచితో పోల్చారు. అయితే ఎప్పటిలాగే ఈ వేడుకలోనూ సుడిగాలి సుధీర్‏ను అంతా కలిసి ఓ ఆట ఆడుకున్నారు. మరోసారి ఆది తన తెలివితో సుధీర్‏ను నాని దగ్గర ఇరికించాడు. వేప ఆకులను తినాలని.. అది తింటే నాని టక్ జగదీష్ సినిమా హిట్ అవుతుందని చెప్పుకోచ్చాడు. దీంతో మీ మూవీ హిట్ కావాలని తింటున్నా అంటూ కష్టం మీద తిన్నాడు సుధీర్. అయితే శ్యాం సింగరాయ్ షూటింగ్ పూర్తికావాలని.. దాని ప్రీరిలీజ్ కూడా సక్సెస్ కావాలని.. అందుకు మిగిలి ఆకులను తినాలని మళ్లి ఇరికించాడు ఆది. ఇక నాని కూడా నేను ఆది మాటలతో కనెక్ట్ అయ్యాయని.. నువ్వు ఆ ఆకులను తినాలని నాని సుధీర్‎ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ఇక చేసేదేంలేక మొత్తం తినేశాడు సుధీర్.

Also Read: సెన్సార్ పూర్తిచేసుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. U/A సర్టిఫికేట్.. కారణం ఎంటంటే..

Ram Pothineni: పవర్ ఫుల్ లుక్‏లో ఎనర్జిటిక్ హీరో… మొదటి సారి ఆ పాత్రలో నటించనున్న రామ్..