విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..

Liger Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో... మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'లైగర్'. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) టాలీవుడ్‏కు

విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. 'లైగర్' కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..
Liger Team
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2021 | 5:57 PM

Liger Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో… మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) టాలీవుడ్‏కు హీరోయిన్‏గా పరిచయం కాబోతుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్‏లో శిక్షణ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను పూర్తిగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కించేందుకు పూరీ భారీగానే ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడానికి ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ (Andy Long) లైగర్ కోసం పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‏గా ప్రకటించంది చిత్రయూనిట్. ఆండీ లాంగ్ జాకీచాన్ సినిమాలతోపాటు పలు హాలీవుడ్ చిత్రాలకు కూడా వర్క్ చేశాడు. ఇప్పటికే ఆండీ తన యూనిట్‏తో కలిసి స్పెషల్‏గా కొన్ని యాక్షన్ సీన్స్ రెడీ చేస్తున్నట్లుగా టాక్.

ట్వీట్..

Also Read: Rana Daggupati: సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో రానా.. 1940 పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‏తో మూవీ..

‘జలజల జలపాతం’ సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..

Actor Prakash: తల్లిదండ్రులది ప్రేమవివాహం.. బాల్యం నుంచి కష్ఠాలు ఎదుర్కొన్న విలక్షణ నటుడు..ఆయన జర్నీ కూడా స్ఫూర్తివంతం