Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Karthika Deepam: వంటలక్క.. ఈ పేరు తెలియని వారుండరు.. టెలివిజన్ చరిత్రలోనే కార్తీక దీపం రికార్డులు సృష్టిస్తుంది. అత్యధిక కాలం టాప్ రెటింగ్‏లో దూసుకుపోతుంది 'కార్తీక దీపం'. భార్యను అనుమానంతో

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
Vantalakka
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 06, 2021 | 6:59 PM

Karthika Deepam: వంటలక్క.. ఈ పేరు తెలియని వారుండరు.. టెలివిజన్ చరిత్రలోనే కార్తీక దీపం రికార్డులు సృష్టిస్తుంది. అత్యధిక కాలం టాప్ రెటింగ్‏లో దూసుకుపోతుంది ‘కార్తీక దీపం’. భార్యను అనుమానంతో ఏలుకోని డాక్టర్ బాబు.. వ్యక్తిత్వాన్ని నమ్ముకుని.. భర్త నమ్మినప్పుడే అత్తగారింటికి వస్తాను అనే వంటలక్క.. కానీ..తల్లిదండ్రులు ఇద్దరు కలిసుంటే చూడాలనుకునే పిల్లలు. కానీ డాక్టర్ బాబు, వంటలక్క కలవకుండా చేసే మోనిత.. ఇదే కార్తీక దీపం సీరియల్. రాత్రి 7.30 అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కార్తీక దీపం సీరియల్ చూడాల్సిందే. ఇప్పటికే ఈ సీరియల్ చూడకుండా ఉండలేనివారు చాలా మందే ఉన్నారు. అంతాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సీరియల్‏కు ప్రధాన బలం వంటలక్క. తన వ్యక్తిత్వాన్ని చంపుకోని ఓ భార్యగా.. భర్త అనుమానాలను తొలగించడానికి.. ఎదురైన ప్రతి కష్టాన్ని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కోంటున్న దీప పాత్రలో నటిస్తూ.. వంటలక్కగా గుర్తింపు సొంతం చేసుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వానాథ్. ఈ సీరియల్‏లో వంటలక్క (దీప) పాత్రలో అద్భుతంగా నటిస్తూ.. తెలుగువారి ఇంట్లో ఆడపిల్లగా మారిపోయింది ఈ మలయాళ భామ.

ఈ సీరియల్ ద్వారా ప్రేమి విశ్వనాథ్‏కు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ అమ్మడుకు సంబంధించిన ప్రతి విషయం నెట్టింట్లో ట్రెండ్ అవుతూ ఉంటుంది. అలాగే వంటలక్క కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటూ.. తన వ్యక్తిగత విషయాలతోపాటు… సీరియల్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే స్టార్ మా ఛానల్ ఉగాది పండుగను పురస్కరించుకొని .. మా ఉగాది వేడుక అనే స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. అందులో పలు సీరియల్స్ నటీనటులు విభిన్న స్క్రిప్ట్స్ చేస్తూ.. ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఆ వీడియోలో డాక్టర్ బాబు రాముడిగా, వంటలక్క సీతగా, పిల్లలు సౌర్య, హిమలు లవకుశలుగా కనిపిస్తూ.. రామయణ గాథను వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుక కోసం సీతలాగా రెడీ అయిన ప్రేమివిశ్వనాథ్ తన ఫోటోను..నయనతారతో పోల్చూతూ.. రామయణమే.. శ్రీ రామయణమే అనే సాంగ్ జత చేసి తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. ప్రేమి విశ్వనాథ్ కంటే నయనతారనే బాగుంది… నయనతార మేకప్ నేచురల్‏గా ఉంది… కానీ మీకు మేకప్ ఓవర్ అయ్యింది అంటూ కామెంట్స్ చేశారు.

ట్వీట్..

Also Read: విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..

‘జలజల జలపాతం’ సాంగ్ మేకింగ్ వీడియో.. రొమాన్స్‏ సీన్లలో ఒకరిని మించి ఒకరు.. చివరకు బేబమ్మను భయపెట్టేశారుగా..