Pushpa Movie: ‘పుష్ప’రాజ్ వచ్చేశాడు.. తగ్గేదేలేదంటున్న బన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో

Pushpa Movie: 'పుష్ప'రాజ్ వచ్చేశాడు.. తగ్గేదేలేదంటున్న బన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..
Allu Arjuna Pushpa Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2021 | 8:31 PM

Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో పూర్తి డీ గ్లామర్ లుక్కులో బన్నీ కనిపించబోతున్నట్లుగా ముందుగానే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్. ఇప్పటివరకు స్టైలీష్ లుక్కులో కనిపించిన బన్నీ.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‏గా రాబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న 8 గంటల 19 నిమిషాలకు పరిచయం చేయబోతున్నట్లుగా ముందుగానే ప్రకటిస్తూ.. ఓ చిన్న వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో పరిగెడుతూ కనిపించాడు బన్నీ. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు బన్నీ పూర్తి లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

తాజాగా బన్నీకి సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో దట్టమైన అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లకు.. పోలీసులు మధ్య జరిగబోయే యాక్షన్ సీన్స్ చూపించాడు సుకుమార్. ఈ టీజర్‏లో కేవలం బన్నీ ‘తగ్గేదే లే’ అని చేప్పే డైలాగ్ ఒక్కటే ఉండగా.. బ్యాక్ గ్రౌండ్‏లో వచ్చే మ్యూజిక్ అదిరిపోయింది. ఇందులో బన్నీ పూర్తిగా ఊర మాస్ లుక్కులో కనిపించాడు. ఇక ఈ వీడియోలో అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రష్మిక పాత్రను కూడా చూపించాడు. రష్మిక అచ్చం పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది.

ఈ సినిమాలో బన్నీ ప్రతినాయుకుడిగా బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది.

వీడియో..