AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Teja: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసుడు.. తనయుడిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోన్న తేజ..?

Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు తేజ. విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ వెళుతుంటాడు. మొదట్లో కొంత మంది బడా స్టార్లను డైరెక్ట్‌ చేసిన తేజ ఇటీవలి కాలంలో చిన్న..

Director Teja: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో వారసుడు.. తనయుడిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతోన్న తేజ..?
Teja New Moive Hero
Narender Vaitla
|

Updated on: Apr 07, 2021 | 8:59 PM

Share

Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు తేజ. విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ వెళుతుంటాడు. మొదట్లో కొంత మంది బడా స్టార్లను డైరెక్ట్‌ చేసిన తేజ ఇటీవలి కాలంలో చిన్న హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. పెద్దగా స్టార్‌ ఇమేజ్‌ ఉన్న హీరోల జోలికి పోకుండా తాను చెప్పదలుచుకున్న కథను ప్రేక్షకులకు తెలియజేయడానికి తేజ ప్రయత్నిస్తుంటాడు. ఇక తేజ కెరీర్‌లో ‘చిత్రం’ సినిమాకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిసినిమానే అయినప్పటికీ ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. తేజ కెరీర్‌కు బూస్ట్‌నిచ్చిన ఈ సినిమాకు తాజాగా సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడిన విషయం తెలిసిందే. తేజ ఇప్పటికే ‘చిత్రం 1.1’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇందులో ఎవరు నటించనున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో తేజ తనయుడు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో తన కొడుకు అమితవ్‌ తేజని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి తేజ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అమితవ్‌ ఇప్పటికే విదేశాల్లో యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 18నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజే హీరోను పరిచయం చేస్తారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే 18వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. ఇదిలా ఉంటే తేజ వరుస పరాజయాల తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అనంతరం వచ్చిన ‘సీత’ మళ్లీ నిరాశ పరిచింది. మరి ఈ కొత్త సినిమా అయినా తేజకు పూర్వ వైభవం తెత్చిపెడుతుందోమో చూడాలి.

Also Read: Pushpa Movie: ‘పుష్ప’రాజ్ వచ్చేశాడు.. తగ్గేదేలేదంటున్న బన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు డబుల్ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న హరీష్ శంకర్.. ఇక అభిమానులను ఆపలేం..

Sonu Sood: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.. సంజీవని వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన సోనూసూద్..