‘పుష్ప’ కోసం రంగంలోకి ఆస్కార్ విజేత.. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‏పీరియన్స్‏ను అందించనున్న సుకుమార్..

Pushpa Movie Update: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్... మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో 'పుష్ప'

  • Rajitha Chanti
  • Publish Date - 8:58 pm, Wed, 7 April 21
'పుష్ప' కోసం రంగంలోకి ఆస్కార్ విజేత.. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‏పీరియన్స్‏ను అందించనున్న సుకుమార్..
Resul Pookutty

Pushpa Movie Update: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్… మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నాడు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పుష్ప అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్‏కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా.. విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‏గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను అందిస్తున్నారు. ఇప్పటికే వీడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‏తో ఈ సినిమా పై మరింత హైప్‏ను క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్పరాజ్ పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.. ప్రస్తుతం విడుదలైన వీడియో చూస్తుంటే పుష్ప ఏ రేంజ్‏లో ఉండబోతునే హింట్ ఇచ్చేశాడు సుకుమార్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 13న రాబోతుంది.

ఈ క్రమంలో పుష్పను మరింత హైలేట్ చేయడానికి ఇప్పటికే టాప్ టెక్నీషియన్లను తీసుకున్న సుకుమార్.. తాజాగా సౌండ్ డిజైనింగ్‌లో ఏకంగా ఆస్కార్ అవార్డును అందుకున్న రసూల్ పొకుట్టిని ‘పుష్ప’ కోసం తీసుకున్నాడు. ఎక్కువగా అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సౌండ్ డిజైనింగ్ చాలా కీలకంగా ఉంటుంది. అందులో ప్రతి శబ్దాన్నీ క్యాప్చర్ చేసి మంచి క్వాలిటీతో అందిస్తే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి అందుతుందనే ఉద్దేశ్యంతో పొకుట్టిని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. రసూల్ ఇటీవల రానా అరణ్య సినిమాకు సౌండ్ డిజైనింగ్ చేశాడు. అరణ్య లాగే పూర్తి స్థాయి అటవీ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతుండడంతో రసూల్‏ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read: Pushpa Movie: ‘పుష్ప’రాజ్ వచ్చేశాడు.. తగ్గేదేలేదంటున్న బన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..

చెట్టెక్కి కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్…స్పెషల్ రోజున అభిమానులకు మంచి సందేశం ఇచ్చిన బ్యూటీ..