Karthika Deepam Serial: అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకు ఉంది.. ఎవరికి గెస్ట్ అని తండ్రిని నిలదీసిన హిమ..

మీ అమ్మ నన్ను అసలు తలచుకునేది కాదేమో అన్న కార్తీక్ తో శౌర్య మాట్లాడుంది. లేదు నాన్న.. అమ్మ వెళ్లినప్పటి నుంచి నిన్ను తలచుకుంటూనే ఉంది. బొట్టులో మంగళ సూత్రం లో...

Karthika Deepam Serial:  అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకు ఉంది.. ఎవరికి గెస్ట్ అని తండ్రిని నిలదీసిన హిమ..
Karthika Deepam
Follow us

|

Updated on: Apr 08, 2021 | 6:42 PM

Karthika Deepam Serial: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతున్న కార్తీక్ దీపం వెయ్యి ఎపిసోడ్స్ పైగా ప్రసారం అవుతుంది. రోజుకో ట్విస్ట్ తో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈరోజు (ఏప్రిల్ 8) 1008 వ ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ను చూద్దాం..!

మీ అమ్మ నన్ను అసలు తలచుకునేది కాదేమో అన్న కార్తీక్ తో శౌర్య మాట్లాడుంది. లేదు నాన్న.. అమ్మ వెళ్లినప్పటి నుంచి నిన్ను తలచుకుంటూనే ఉంది. బొట్టులో మంగళ సూత్రం లో నువ్వు ఉంటావంట అని శౌర్య చెబితే కార్తీక్ కన్నీరు పెడతాడు. పిల్లలతో తనను వదిలి పెట్టి వెళ్లకుండా ఒట్టు వేయించుకుంటాడు.

ఇక మరోవైపు మోనిత యోగా చేస్తూ.. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని కోరుకుంటుంది. కానీ కార్తీక్ ఇడ్లి బండి దగ్గర ఉంది గుర్తుకొస్తుంది.. అసహనానికి గురవుతూ.. ప్రియమణి ని సతాయిస్తుంది. ఒకే సారి కాఫీ జూస్ తాగాలనిపిస్తుందని చెప్పి… రెండు కలిపి కాఫీ జూస్ పెట్టుకుని రమ్మనమని చెబుతుంది. మీరు కార్తీక్ ని వదలరు.. వంటలక్కని డాక్టర్ బాబు వదలరు.. నాకు ఈ దారిద్రపు పనులు చేసే దురదృష్టం వదలదు అని అనుకుంటుంది.. ప్రియమణి.

పిల్లల కోసం కార్తీక్ ఉన్న రూమ్ లోని వచ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న పిల్లలని చూసి తండ్రి పక్కన ఉంటె.. అభద్రత ఉండదేమో అని అంటుకుంటుంది. మరి నేను .. పిల్లలకు న్యాయం చేయాలనీ పించింది కానీ తల్లికి అన్యాయం జరిగినా ఆ ఆమనిషికి అనవసరం అనుకుంటూ.. వాళ్ళని నిద్ర లేపుతుంది. శౌర్య నిద్రలేచి నాన్న టిఫిన్ బోర్డు ను చూపిస్తుంది. హిమ శౌర్య లు నిద్రలేచి వాళ్ళ నాన్నకు గుడ్ మార్నింగ్ చెబుతారు. ఈ బోర్డు నాన్న ఎందుకు తెచ్చారో తెలుసా.. ఇది చూసినప్పుడు నాన్నను వదిలేసి వెళ్ళకూడదు అని అంటారు.. తమతో ప్రామిస్ తీసుకున్న విషయం చెబుతారు.

ఇక మార్నింగ్ వాకింగ్ వెళ్లి వచ్చిన అననందరావు సౌందర్యలు పార్క్ లో దీప కార్తీక్ గురించి మాట్లాడుకుంటారు. తాను కార్తీక్ తో దీప గురించి మాట్లాడిన విషయం చెబుతాడు.. దీప కి ఇపుడు ఉద్యోగం వద్దు అని చెప్పాడు. వాడి మనసులో ఏముందో నాకు అర్ధం కావడం లేదు.. ఒక్క అనుమానం విషయంలో తప్ప ఇంక దేనిలోనూ వాడి ప్రవర్తన తప్పు పట్టేవిధంగా ఉండదు. ఆడవాళ్ళ స్వతంత్రంగా బతకడంలో వాడికి ఆక్షేపణ ఉండదు. నేను అదే ఆలోచిస్తున్నా.. వచ్చిన దగ్గర నుంచి వాడికి పిల్లలని తీసుకొచ్చిన ఆనందం కనిపించడం లేదు. అసలు ఒకరికొకరు ఎదురు పడడం లేదు..మాట్లాడుకోవడం లేదు.. అక్కడ ఏమైనా జరిగిఉంటే పిల్లలు చెప్పేవారు .. ఏమైఉంటుంది అని ఆలోచిస్తారు.. జవాబు కార్తీక్ దగ్గరే ఉంటుంది.. తానె ఎలాగైనా కనుకుంటాను అంటుంది సౌందర్య.

దీపకి గతం గుర్తు కొచ్చి అసహనానికి గురవుతుంది. ఇంతలో పనిమనిషి వస్తుంది. మీరు ఎప్పుడు వచ్చారు అని దీపని అడిగితె.. నిన్న వెలుతులోనే వచ్చా.. ఈరోజు చీకటి అయ్యింది. అంతా తలకిందులు అయిపొయింది మాలతి అంటుంది. నిజంగా మిమ్మల్ని మళ్ళీ చూస్తాను అనుకోలేదమ్మా.. కాఫీ ఇస్తా కళ్ళు తిరిగడం తగ్గుతుంది. అమ్మగారు అయ్యగారు చిన్నబాబు, శ్రావ్యమ్మ అందరూ మీ గురించి బెంగపెట్టుకున్నారు అమ్మా.. మిమ్మల్ని వెదకడానికి అమ్మగారే మీ నాన్నగారిని పంపించారట కదమ్మా.. మీ నాన్నగారే మిమ్మల్ని తీసుకొచ్చారా అమ్మా అంటుంది.. కాదు మాలతి.. డాక్టర్ బాబు తీసుకొచ్చారు అని చెబుతుంది దీప.. దీంతో మాలతి సంతోష పడుతుంది..

మీరు పెద్దింటి కోడలు నేను వంట మనిషి.. అయినా ఒక్కమాట చెప్పాలనుకుంటునా అంటూ.. ఇది మీ ఇల్లు .. మీ పిల్లల నాన్నమ్మ ఇల్లు.. మీరు ఈ ఇంటికి పెద్ద కోడలు,, పెద్ద పేరున్న డాక్టర్ బాబు భార్య.. ఇది మీ ఇల్లు ఎందుకు వెళ్ళాలమ్మా.. కోరికష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకమ్మా అంటుంది మాలతి..

డాక్టర్ బాబు వంటలక్కని తీసుకొచ్చాడు మాలతి.. డాక్టర్ బాబు భార్యని తీసుకొని రాలేదు.. అదే స్థాయి భేదం అంటుంది దీప. గడప వరకు సంతోషంగా వచ్చిన నేను ఇంట్లోకి వచ్చాక ఆ ఆనందం మొత్తం పొయ్యింది

ఇక హిమ కార్తీక్ దగ్గరకు వచ్చి ఏమిటి అలా ఉన్నావు.. ఉండు.. నేను నీకు నిమ్మకాయ సోడా చేసి తీసుకొస్తా అంటుంది. ఇది ఎక్కడ నేర్చుకున్నావు అంటాడు కార్తీక్.. విజయనగరంలో డాడీ.. నేను చలం వెళ్లి నేర్చుకున్నా .. అది కూడా అమ్మకు తెలియకుండా నేర్చుకున్నా అంటుంది. అమ్మ ఇడ్లి బండి దగ్గర వేడికి రోజూ కొబ్బరి నూనె రాసుకునేది.. ఒకొక్కసారి అమ్మ వేడి అన్నం కూడా ముట్టుకోలేని స్థితిలో చేతులు కాలేవి అని టిఫిన్ సెంటర్ కష్టాలు చెబుతుంటే.. ఇక ఆపు హిమ.. ఆ కష్టాల గురించి నా దగ్గర చెప్పకు హిమ అంటూ డాక్టర్ బాబు అంటాడు. నేను మిమ్మల్ని వెళ్లనివ్వను.. మరి అమ్మని పంపించేస్తావా అంటుంది.. హిమ అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకు ఉంటుంది…. అమ్మ అమ్మే కదా అమ్మ గెస్టా .. ఎవరికీ గెస్ట్ నీకా అందరికా.. గెస్ట్ అంటే వచ్చి వెళ్లిపోయేవారు కదా డాడీ.. అంటూ తండ్రిని ప్రశ్నిస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో దీపని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడానికి కార్తీక్ దీప దగ్గరకు వస్తాడు… వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వాగ్వాదం మొదలవుతుంది.. దీప ఆస్పత్రికి వెళ్తుందా లేదా రేపటి ఎపిసోడ్ లో చూడాలి మరి

Also Read: మనం పళ్ళను శుభ్రపరచుకోవడానికి వాడే టూత్ పేస్ట్ ఎన్ని రోగాలను తెస్తుందో తెలుసా..!

రొటీన్ ఫుడ్ భిన్నంగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ.. బేబీ కార్న్, శనగల రైస్..