- Telugu News Entertainment Tollywood Malayalam actress nithya menon birthday special story her first telugu movie and awards latest movie
Nithya Menen Birthday: అందం, అభినయం కలబోసిన బబ్లీ గర్ల్.. ట్యాలెంట్‌కు చిరునామా ఈ చిన్నది..
Nithya Menen Birthday: అందంతో పాటు ట్యాలెంట్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో నటి నిత్యా మేనన్ ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నిత్య.. పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా..
Updated on: Apr 08, 2021 | 10:07 AM

నిత్యా మేనన్ 1988, ఏప్రిల్ 8న బెంగళూరులో జన్మించింది. 'ది మంకీ హు న్యూ టు మచ్' అనే ఇంగ్లీష్ చిత్రంలో బాలనటిగా తెరగేంట్రం చేసిందీ చిన్నది.

మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిస్ట్ విద్యను పూర్తి చేసిన నిత్యాకు పాత్రికేయ రంగంలోకి వెళ్లాలని కోరిక ఉండేది. కానీ నటిగా స్థిరపడింది.

కేవలం నటనకే పరిమితం కాకుండా మంచి సింగర్‌గానూ పేరు తెచ్చుకుందీ బ్యూటీ.

'7 ఓ క్లాక్' సినిమాతో 2006లో చిత్రసీమకు పరిచయమైన నిత్య.. 2010లో వచ్చిన 'అలా మొదలైంది'తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

'అలా మొదలైంది' చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకుంది.

నటనకు ప్రాధాన్యముండే పాత్రలో నటించే నిత్య.. ఎన్టీఆర్‌లాంటి అగ్ర హీరోలతోనూ ఆడిపాడింది.

ప్రస్తుతం తెలుగులో 'గమనం'తో పాటు మరో రెండు మలయాళం చిత్రాల్లో నటిస్తోంది.

మరి ఈ ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్టర్‌కు మనమూ హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దామా..!




