’11th Hour’ Telugu web series: మగవారికన్నా మహిళలే మల్టీ టాలెంటెడ్ : ప్రవీణ్ సత్తారు
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రధారిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న తెలుగు ఓటీటీ ఆహా..
Praveen Sattaru: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రధారిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ ‘లెవన్త్ అవర్’. తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న తెలుగు ఓటీటీ ఆహా.. వారి ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు ఉగాది సంబరాలను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుగానే తీసుకొస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారి నటించిన ఒరిజినల్ ‘లెవన్త్ అవర్’ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ‘లెవన్త్ అవర్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆహా సీఈఓ అజిత్ ఠాగూర్, నిర్మాత ప్రదీప్ ఉప్పల పాటి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు పాల్గొన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ – ‘‘‘లెవన్త్ అవర్’ కోసం టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం. మగవారు మల్టీ టాలెంటెడ్ కారు. కానీ మహిళలు మాత్రం మల్టీ టాలెంటెడ్ అన్నారు. మగువలు పది పనులైనా చేయగలరు. అలాంటి మహిళల గురించి చెప్పాల్సిన సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అదే మేం ఈ వెబ్ సిరీస్‌లో చెప్పాం అని అన్నారు. అరత్రికా రెడ్డి అనే అమ్మాయి ఈ సిరీస్‌లో ప్రారంభం నుంచే స్ట్రాంగ్ ఉమెన్ కాదు.. సమస్యను ఎదుర్కొనే క్రమంలో ఆమె బలవంతురాలిగా మారుతుంది. ఆమె ఈ కథలో హీరో. ఆమె బలాలే కాదు.. బలహీనతలను గురించి కూడా వెబ్ సిరీస్‌లో చూపెట్టాం. ముఖేష్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. ప్రదీప్‌గారు రాసిన స్క్రిప్ట్ చదవగానే బాగా నచ్చేసింది. చాలా కూల్‌గా పని పూర్తి చేశాను. 33 రోెజుల్లో షూట్ పూర్తి చేశాం. యాక్టర్స్, టెక్నికల్ టీమ్ సపోర్ట్‌తో పనిని సులువుగా పూర్తి చేశాం. తమన్నా ఏదో కొత్తగా చేయాలని ఆతృత పడుతుంటుంది. అలాగే అరుణ్, మహతి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అన్ని పాత్రలు సపోర్ట్ చేయడంతో అరత్రికా పాత్రకు బలం చేకూరింది’’ ప్రవీణ్ సత్తారు అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kim Kardashian : బిలియనీర్ క్లబ్‌లో చేరిన హాలీవుడ్ భామ..! ఇప్పుడు ఆమె ఆదాయం ఎంతో తెలుసా..?