Happy Birthday Allu Arjun: స్టైల్ కు సరైన అర్ధం చెప్పిన స్టార్.. హ్యాపీ బర్త్ డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసాడు బన్నీ

Happy Birthday Allu Arjun: స్టైల్ కు సరైన అర్ధం చెప్పిన స్టార్..  హ్యాపీ బర్త్ డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2021 | 8:30 AM

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో చేసాడు. హీరోగా బన్నీ మొదటి సినిమా గంగోత్రి. ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ‘ఆర్య’ సినిమా చేసాడు బన్నీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ నటన, డ్యాన్స్ ఆకట్టుకున్నాయి. దేవీశ్రీ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచాయి.

ఆతర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో ‘బన్నీ’అనే సినిమా చేసాడు. ఈ సినిమాకూడా సూపర్ హిట్ ను అందుకుంది. ఇలా వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించాడు బన్నీ. ఇక పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ సినిమా అల్లు అర్జున్ ను మాస్ ఆడియన్స్ కు చేరువచేసింది. అక్కడినుంచి వెనుతిరిగి చూడలేదు నటనతో డైలాగ్స్ తో తనదైన మ్యానరిజంతో తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు బన్నీ. పరుగు, ఆర్య 2, ఎవడు, రుద్రమ దేవి, ఇద్దరమ్మాయిలతో,వేదం, రేసు గుర్రం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, నాపేరు సూర్య , అలవైకుంఠపురంలో వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు బన్నీ. ఇక అల్లు అర్జున్ కు ఉన్న అభిమానుల గురించి ఎంత చెప్పిన తక్కువే.. బన్నీకి కేవలం తెలుగులోనే కాదు మలయాళంలోను భారీ అభిమానగణం ఉంది. బన్నీకి సంబంధించిన ఈ విషయమైనా అభిమానులకు పండగే..ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు బన్నీ. నేడు స్టైలిష్ స్టార్ బర్త్ డే. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు పుట్టిన రోజు టీవీ9 ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ సినిమాకు ఆసక్తికర టైటిల్.. ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

Kim Kardashian : బిలియనీర్‌ క్లబ్‌లో చేరిన హాలీవుడ్ భామ..! ఇప్పుడు ఆమె ఆదాయం ఎంతో తెలుసా..?

ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది.. యాంకర్ అనసూయ కామెంట్స్..

ఏపీ పరిషత్ పోరు….