Pawan Kalyan: పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ సినిమాకు ఆసక్తికర టైటిల్.. ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చిన అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ప్రస్తుతం వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ సినిమాకు ఆసక్తికర టైటిల్.. ఫిలిమ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త
Pawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2021 | 7:43 AM

Pawan Kalyan:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చిన అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ప్రస్తుతం వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు పవన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా రాబోతుంది. ఈ మూవీలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దగ్గుబాటి రానా కూడా కనిపించనున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు అనే పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు పవన్.

ఈ సినిమాల తర్వాత మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో సినిమా అనగానే అభిమానుల్లో ఆనందం నెక్స్ట్ లెవల్ కు చేరింది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హరీష్ సినిమా దేశభక్తి నేపథ్యంలో ఉండనుందని కొందరు అంటున్నారు. మరికొంతమంది గబ్బర్ సింగ్ లాంటి మాస్ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాటైటిల్ ఇదే అంటూ మరో వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమాకు సంచారి అనే టైటిల్ అనుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఇండియా గేట్ చూపిస్తూ వెనక సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ ఫోటోలు.. ఓ బైక్.. దాని పైన పెద్ద బాలశిక్ష ఒక గులాబీ పువ్వు ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ మరియు ‘హరి హర వీరమల్లు’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్.. త్వరలోనే హరీష్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : Kim Kardashian : బిలియనీర్‌ క్లబ్‌లో చేరిన హాలీవుడ్ భామ..! ఇప్పుడు ఆమె ఆదాయం ఎంతో తెలుసా..?

ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది.. యాంకర్ అనసూయ కామెంట్స్..

ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఫిదా సినిమాను రిజెక్ట్ చేశారు.. సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల కన్నీటి పర్యంతం..