corona lockdown : దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న కోవిడ్ మహమ్మారి, సంపూర్ణ లాక్ డౌన్లు, కర్ఫ్యూలతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
corona vaccination : వ్యాక్సినేషన్‌పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది.
corona lockdown : దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు రావడంతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయిస్తే, అటు ఆయా రాష్ట్రాలు కరోనా కేసులు విజృంభించడంతో తాజాగా ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. ఈనెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. దుర్గ్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ అమల్లో ఉంది. పంజాబ్‌లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. ఇక మహారాష్ట్రలో వ్యాక్సిన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మరో రెండు రోజులకు సరిపడ డోస్‌లు మాత్రమే తమ దగ్గర ఉన్నాయని కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం లేఖరాసింది. వ్యాక్సిన్ కొరత లేదని . మహారాష్ట్రకు తగినన్ని డోస్‌లు పంపిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొన్ని రాష్ట్రాలు అనవసరంగా వ్యాక్సిన్ నిల్వలపై అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దేశంలో ఎలాంటి వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం టీకా కేంద్రాలు మూసేసే పరిస్థితి ఉందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికి టీకా ఇవ్వాలని మహారాష్ట్ర , ఢిల్లీ , పంజాబ్ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి.