AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..పెరుగుతున్న కరోనా కేసులు.. 144 సెక్షన్ విధింపు.. గుంపులుగా బయటికి వెళ్లారో..

Corona Effect: కరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..పెరుగుతున్న కరోనా కేసులు.. 144 సెక్షన్ విధింపు.. గుంపులుగా బయటికి వెళ్లారో..
144 Section In Bengaluru
Shiva Prajapati
|

Updated on: Apr 07, 2021 | 7:45 PM

Share

Corona Effect: కరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా గతేడాది కంటే కూడా అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతకు మించి మరణాలు కూడా నమోదవడం ఇప్పుడు మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అందులో కర్ణాటక కూడా ఒకటి. ఇంకా కర్ణాటక రాజధాని బెంగళూరులో అయితే విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో అత్యధికంగా బెంగళూరులోనే నమోదువుతున్నాయి.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జన సమూహాలను నివారించేందుకు గానూ సెక్షన్ 144ని విధించింది. ఆ మేరకు అధికారి ప్రకటన విడుదల చేసింది. ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా బెంగళూరు సిటీలో ఆంక్షలు విధించడం జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ఇక బెంగళూరు నగర పరిధిలోని అన్ని అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో స్విమ్మింగ్ పూల్స్, వ్యాయామశాలలు, ఫంక్షన్ హాల్స్ లను మూసివేయాలని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను బెంగళూరు సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు.

కాగా, కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజు 6వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఈ సంవత్సరంలోనే అత్యధికం. అయితే, తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క బెంగళూరులోనే అత్యధికంగా 4,266 కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం 144 సెక్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా సెకండ్ వేవ్‌లో రోజూవారీ కేసులు అత్యధికంగా పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఒకటి అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల్లో కర్ణాటకలోనే 5.35 శాతం కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక కర్ణాటకలో ఇప్పటి వరకు 4,55,025 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,605 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Also read: తెలంగాణ గడ్డపై యాక్టివ్ అయిన జనసేన, వరంగల్ గ్రేటర్ వార్‌లో యుద్ధానికి సై.. భారీ ర్యాలీతో సమరశంఖం

Viral Video: ఈ బుడ్డోడు వయసులోనే చిన్నోడు..దయా గుణంలో చాలా పెద్దోడు.. పిల్లలంటే ఇలా ఉండాలి..