Modi video conference: ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు.. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయాలు?

దేశంలో కరోనా వైరస్ విస్తరించడం మొదలై ఏడాది దాటిపోయింది. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఉత్కంఠ రేపిన కరోనా వైరస్ విస్తృతి ఆ తర్వాత తగ్గు ముఖం పట్టడంతో..

Modi video conference: ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు.. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై కీలక నిర్ణయాలు?
Modi
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 07, 2021 | 7:19 PM

Modi video conference with Chief Ministers: దేశంలో కరోనా వైరస్ (CORONAVIRUS) విస్తరించడం మొదలై ఏడాది దాటిపోయింది. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ (SEPTEMBER 2020) దాకా ఉత్కంఠ రేపిన కరోనా వైరస్ విస్తృతి ఆ తర్వాత తగ్గు ముఖం పట్టడంతో హమయ్య అనుకుంటున్నంతలోనే దేశంలో సెకెండ్ వేవ్ కరోనా (CORONA SECOND WAVE) విస్తరణ జోరందుకుంది. మొదటి సారి కరోనా వైరస్ వచ్చినపుడు ఎంత వేగంగా విస్తరించిందో.. అంతకు మూడింతల వేగంతో ఇపుడు దేశంలో కరోనా విస్తరిస్తోంది. వైరస్ విస్తరణ పీక్ లెవెల్లో వున్న దశలో ఒక రోజు హయ్యెస్ట్ కేసుల సంఖ్య గరిష్టంగా లక్షకు అటు ఇటుగా వుండింది. కానీ సెకెండ్ వేవ్ షురువయ్యాక.. గత రెండు, మూడు రోజులుగా లక్షకు పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ తున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనా కేసులు పెరుగుతుండటంతో కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే గురువారం (ఏప్రిల్ 8వ తేదీన) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ (VIDEO CONFERENCE WITH CHIEF MINISTERS) నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ (CORONA VACCINATION) వేగవంతం వంటి అంశాలపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్నారు. వైరస్‌ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకోనున్నారు మోదీ (MODI). ముఖ్యంగా కరోనా నియంత్రణలో ఘోరంగా విఫలమై ఇపుడు యావత్ దేశాన్ని టెన్షన్‌లోకి నెట్టిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (MAHARASHTRA CHIEF MINISTER UDDAV THAKRE)కు మోదీ కీలక సూచనలు చేసే అవకాశముంది. గత సంవత్సం పలు సందర్భాలలో సీఎంలతో కాన్ఫరెన్సులు నిర్వహించిన ప్రధాన మంత్రి (PRIME MINISTER).. 2021లో ఈ తరహా మూడు కాన్ఫరెన్సులు నిర్వహించారు. జనవరి 11వ తేదీన సీఎంలతో భేటీ అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశంలో జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభించ తలపెట్టిన కరోనా వ్యాక్సినేషన్‌పై చర్చించారు. ఆ తర్వాత మార్చి 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేయగా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (BENGAL CM MAMATA BANERJEE), ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భఘేల్‌ (CHHATTISGARH CHIEF MINISTER BAGHEL) హాజరు కాలేదు. కాగా కరోనా విషయంపై సీఎంలతో మోదీ చర్చించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

గత ఏడాది (2020) కరోనా కేసులు ప్రారంభమైనప్పట్నించి.. తీవ్ర స్థాయికి చేరే దాకా.. ఆ తర్వాత కరోనా నియంత్రణలోకి వచ్చే దాకా.. పలుదఫాలుగా సీఎంలతో వీడియో కాన్ఫరెన్సు సమావేశాలు నిర్వహించారు ప్రధాని మోదీ. తొలుత జనతా కర్ఫ్యూ (JANATA CURFEW)పై ప్రకటన చేసే సందర్భంలో తొలిసారిగా మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు 2020 మార్చి 20వ తేదీన నిర్వహించారు. అందులో కరోనా కట్టడికి కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత పలు సందర్భాలలో దేశ ప్రజలతో నేరుగా లైవ్ ద్వారా సంభాషించి, సందేశాలిచ్చిన ప్రధాన మంత్రి 2020 జులై 27వ తేదీన సీఎంలతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. కరోనా వైరస్ ప్రభావం ఉధృతమవుతున్న దరిమిలా కీలక సూచనలు చేస్తూ.. దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్ లాక్ డౌన్‌ 3.0 (UNLOCK DOWN 3.0)  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలకు సూచనలు చేశారు. 2020 ఆగస్టు 11న పది రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు ప్రధాన మంత్రి. దేశంలో కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ బాగా తగ్గిపోవడం.. పది రాష్ట్రాలలో మాత్రం కేసుల సంఖ్య పెద్ద సంఖ్యలో వుండడంపై సీఎంలతో సమీక్ష జరిపారు.

సెప్టెంబర్‌ 23న కరోనా కేసులు ఎక్కువగా వున్న ఏడు రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన ప్రధాని మోదీ.. పరిస్థితిని సమీక్షించి సూచనలు చేశారు. ఆ తర్వాత దేశంలో కరోనా ప్రభావం బాగా తగ్గినట్లు కనిపించింది. అయితే కొన్ని రాష్ట్రాలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగానే వుండడంతో మరోసారి నవంబర్‌ 24న కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నహర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే, ఈ రాష్ట్రాలలో ఎక్కువగా విపక్షాలకు చెందిన ప్రభుత్వాలుండడంతో ప్రధాని చేసిన సూచనలు వారు పెద్దగా పట్టించుకోలేదు. ఇందులో మహారాష్ట్ర, బెంగాల్, కేరళ, చత్తీస్ గఢ్, ఢిల్లీ వున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాలలోనే కరోనా కేసులు గణనీయంగా పెరుగుతండడంతో యావత్ దేశం మీద ప్రభావం కనిపిస్తోంది.

ALSO READ: తెలంగాణలో టీడీపీ కథ ఖల్లాస్..! ఆరేళ్ళ కాలంలో క్రమంగా అంతర్ధానమైన సైకిల్

ALSO READ: బెంగాల్ బరిలో ఉద్ధండులు.. ఎవరెవరి సీట్లు ఏవంటే?

ALSO READ: చర్చలకు రెడీ అంటున్న మావోయిస్టులు.. ఘోర రక్తపాతం తర్వాత సాధ్యమేనా?

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే