These Five Problems : కివీ పండు గురించి మీకు తెలుసా..? ఈ ఐదు సమస్యలకు చక్కటి పరిష్కారం..! తెలుసుకోండి..
Kiwi Fruit Amazing Benefits : చిన్నగా కనిపించే బ్రౌన్ కలర్ కివీ ఆరోగ్యం విషయంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, ఇతో పాటు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇందులో ఉంటాయి.
Updated on: Apr 08, 2021 | 6:38 AM

కివిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేసింది. కివిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

అనేక పరిశోధనలలో, కివిని వరుసగా ఎనిమిది వారాలు తీసుకుంటే, అధిక బీపీ సమస్య నియంత్రించబడుతుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం, పొటాషియం అధిక బీపీ సమస్యను దూరంగా ఉంచుతాయి.

గర్భిణీ స్త్రీలకు కివి పండు చాలా ప్రయోజనకరం. ఇందులో ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఐరన్, లోపాన్ని తొలగించడంతో పాటు, గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు ఉబ్బసం రోగులు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. దీనిని తీసుకోవడం ద్వారా, శ్వాసకోశ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. ఉబ్బసం ప్రమాదం తగ్గుతుంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ కివి తినడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.



