Hyderabad: న్యూఇయర్ వేడుకలకు ముందు భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రా జోం సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్ధాలను నార్కోటిక్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల ఆల్ప్రా జోలంను సీజ్ చేశారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులు నమోదయ్యాయి..

Hyderabad: న్యూఇయర్ వేడుకలకు ముందు భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రా జోం సీజ్‌
Alprazolam Drugs
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Dec 26, 2023 | 12:45 PM

హైదరాబాద్‌, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్ధాలను నార్కోటిక్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల ఆల్ప్రా జోలంను సీజ్ చేశారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులు నమోదయ్యాయి. ఒక్కో గ్రాము 10 వేల రూపాయల చొప్పున డ్రగ్స్ ముఠా అమ్మకాలు జరుపుతోంది. రూ.3.14 విలువైన ఆల్ప్రాజోలంను డీఆర్ఐ సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ దాడిలో పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా గుర్తించారు. నరసింహ గౌడ్‌తోపాటు అతడి కొడుకు రాజశేఖర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి నెల హైదరాబాద్‌లో నలభై కేజీల వరకూ ఆల్ప్రా జోలం డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు నరసింహ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ ముఠా వెనక ఇంకా ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో నరసింహ గౌడ్ యాక్టీవ్‌గా ఉన్నాడు. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్‌లో మత్తు పదార్థాలు తరలించినట్లు గుర్తించారు. వీటి కోసం నరసింహా హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

మత్తు పదార్థాల ద్వారా వచ్చిన అర్జించిన డబ్బుతో నరసింహ గౌడ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడు. ఇప్పటికే అతడిపై పలు కేసులు ఉన్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దయెత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 34 కేజీల ఆల్ఫ్రా జోలంను నర్సింహ సిటీకి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!