Hyderabad: పాతబస్తీ పొలిటికల్‌ స్క్రీన్‌పైకి జూనియర్‌ ఓవైసీ.. పోటీ చేసేది అక్కడి నుంచేనా..? ఎంఐఎం ప్లానేంటి..?

Hyderabad Old City Politics: పాత బస్తీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హైదరాబాద్‌ పాతబస్తీలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న ఎంఐఎం నుంచి పోటీ చేయడానికి ఓవైసీ కుటుంబంలోని నాలుగో తరం సిద్ధమైంది.

Hyderabad: పాతబస్తీ పొలిటికల్‌ స్క్రీన్‌పైకి జూనియర్‌ ఓవైసీ.. పోటీ చేసేది అక్కడి నుంచేనా..? ఎంఐఎం ప్లానేంటి..?
Akbaruddin Owaisi
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 05, 2023 | 9:45 AM

Hyderabad Old City Politics: పాత బస్తీ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హైదరాబాద్‌ పాతబస్తీలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న ఎంఐఎం నుంచి పోటీ చేయడానికి ఓవైసీ కుటుంబంలోని నాలుగో తరం సిద్ధమైంది. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నూరుద్దీన్‌ను ఎన్నికల బరిలో దింపాలని ఎంఐఎం కేడర్‌ కూడా ఓవైసీ బ్రదర్స్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇటీవల పార్టీ హెడ్ క్వార్టర్ దారుస్సలామ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఎంఐఎం కార్యకర్తలు నూరుద్దీన్ ఎంట్రీపై ప్రకటన ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ఓవైసీ సోదరులు మాత్రం ప్రస్తుతానికి ఈ విషయంపై స్పందించలేదు.. కానీ ఇన్‌సైడ్‌లో మాత్రం నూరుద్దీన్‌కు రాజకీయాలు నూరిపోస్తున్నట్లు దారుస్సలాంలో వినిపిస్తోంది.

చిన్న వయసే కానీ..

అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఎంఐఎం పార్టీకి చెందిన సలార్ – ఎ – మిలత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా, కార్యదర్శిగా పని చేస్తున్నాడు. నూరుద్దీన్‌ను 2018ఎన్నికల సమయంలోనే బరిలోకి దింపాలని కేడర్‌ పట్టుబట్టింది. ఓవైసీల రక్తంలోనే ఉన్న రాజకీయ పరంపరను ఈ జూనియర్‌ ఓవైసీ మరింత డెవలప్‌ చేసేలా ఓవైసీ బ్రదర్స్‌ నూరిపోస్తున్నారట. అయితే, ఇంకా చిన్న వయసు కావడంతో ఇప్పుడే పోటీ ఎందుకని నిరాకరించినా.. ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నూరుద్దీన్‌కు టికెట్ ఇవ్వాలని ఎంఐఎం వర్గాలు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం..

Nooruddin Owaisi

Nooruddin Owaisi

పాతబస్తీలో ఎంఐఎం పరంపరం..!

అయితే, జూనియర్‌ ఓవైసీ.. చాంద్రాయణగుట్ట లేదా బహదూర్‌పుర నుంచి నూరుద్దీన్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్రాయణ గుట్ట నుంచి గత ఐదు పర్యాయాలు వరుసగా నూరుద్దీన్ తండ్రి అక్బరుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు.ఎంఐఎం పార్టీ తొలి సారి 1960లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి.. మల్లేపల్లి వార్డులో విజయం సాధించింది. ఆ స్థానంలో అబ్దుల్ వాహీద్ ఓవైసీ పోటీ చేస్తుండటం విశేషం. ఇక 1962లో పత్తర్‌గట్టి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 1978లో చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే హైదరాబాద్ పాత నగరంలో ఎంఐఎం పార్టీ బలంగా నాటుకొని పోయింది.

ఇవి కూడా చదవండి

తొలిసారిగా..

అయితే, 1984లో తొలిసారి సలాహుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2004 దాకా ఆ సీటులో ఆయనే గెలుస్తున్నారు. తర్వాత కొడుకు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తున్నారు. ఇప్పుడు ఓవైసీ నాలుగో తరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోంది..ప్రస్తుతం ఐఎంఐఎంకు తెలంగాణ అసెంబ్లీలో 7 సీట్లు ఉన్నాయి. ఈసారి కనీసం 15 మందితో అసెంబ్లీలో అడుగు పెట్టాలని కసరత్తు చేస్తోంది. అందులో భాగమే మొదటి అడుగు ఓవైసీ ఇంటి నుంచే పడేలా ప్లాన్‌ చేస్తున్నారట. యాకుత్‌పురా, బహదూర్‌పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఎంఐఎంకు తిరుగుండదు..ఈ నాలుగింటిలో ఎక్కడోచోట జూనియర్‌ను దింపాలని చూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..