Hyderabad: సెయిలింగ్ వీక్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం.. హుస్సేన్ సాగర్‌లో మొదలైన సందడి
Hyderabad sailing week: హుస్సెన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి నెలకొంది. నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో సాగుతూ ఔరా అనిపిస్తున్నాయి.
Updated on: Jul 04, 2023 | 5:50 PM

Hyderabad sailing week: హుస్సెన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందడి నెలకొంది. నీటి అలలపై గాలి పయనం వైపు పడవలు తెరచాపలతో సాగుతూ ఔరా అనిపిస్తున్నాయి. జాతీయస్థాయి వంద మంది సేయిలింగ్ క్రీడాకారులు 12 క్లబ్ ల నుంచి ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 88 మంది రిజిస్టర్ చేసుకొని హుస్సేన్ సాగర్ లో తెరచాప పడవలతో సందడి చేస్తున్నారు.

మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు హుస్సేన్ సాగర్ లో ఈ జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, లేజర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, యాటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ వేదికగా 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరుతో ఈ పడవ పోటీలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ నగరం నడిబొట్టున హుస్సేన్ సాగర్ లో వందలాది పడవలు తెరచాపలతో రెపరెపలాడుతూ కనువిందు చేస్తున్నగా పెద్ద ఎత్తున వీక్షించేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ జనం బారులు తీరారు.

లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్ వంటి 12 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో 11 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తుండంగా తెలంగాణ నుంచి 17 మంది పాల్గొంటున్నారు.

సెయిలింగ్ వీక్ పోటీలో రాణించిన వారిని రాబోయే ఏషియన్ గేమ్స్ కు ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

ఈ ఈవెంట్ తో హుస్సేన్ సాగర్ చుట్టూ సందడి నెలకొంది.
