CM KCR: బలమైన అభ్యర్థి కోసం గులాబీదళం వేట.. గ్రేటర్‌పై వ్యూహం మార్చిన సీఎం కేసీఆర్..! మైనంపల్లి వ్యాఖ్యలతో..
BRS Hyderabad Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు నియోజకవర్గాల వారీగా పరిస్థితులను పరిశీలించి అభ్యర్థులను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

BRS Hyderabad Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. గులాబీ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు నియోజకవర్గాల వారీగా పరిస్థితులను పరిశీలించి అభ్యర్థులను ప్రకటించారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అంతటా బాగున్నప్పటికీ.. కొన్ని చోట్ల బుజ్జగింపులు తప్పడం లేదు. మరికొన్ని చోట్ల అసంతృప్తులు, పార్టీ మార్పు లాంటి వార్తలు వెలువడుతున్నాయి. అయితే, సరిగ్గా టికెట్ల ప్రకటనకు ముందు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలు.. గ్రేటర్‌లో గందరగోళానికి గురిచేశాయి. అంతా బాగుందనుకున్న తరుణంలో మైనంపల్లి హన్మంతరావు.. తనకు, తన కుమారుడికి సీట్లు ఇవ్వాలని.. లేకపోతే.. ఇండిపెండెంట్‌గానైనా బరిలో దిగుతామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మంత్రి హరీష్‌రావుపై చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో ఆగ్రహానికి కారణమయ్యాయి. మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా ఫైర్ అయ్యారు. అయితే.. మైనంపల్లి వ్యాఖ్యల అనంతరం.. గ్రేటర్‌లో కేసీఆర్ వ్యూహం మారుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మంత్రి హరీష్ రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి వాఖ్యల తరువాత BRS యాక్షన్ ఏంటి?.. పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది.. అనే ఊహగానాల మధ్య హైదరాబాద్ పరిధిలోని సీట్ల విషయంలో కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
మల్కాజ్‌గిరి సీటు విషయంలో కేసీఆర్.. మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ మైనంపల్లిపై అధికార పార్టీ బీఆర్‌ఎస్.. వేటు వేస్తే అక్కడ ఛాన్స్ ఎవరికి..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మైనంపల్లిని తప్పిస్తే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపే యోచనలో BRS హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. 2019లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ సీఎం కేసీఆర్.. ఈ సీటు విషయంలో మరో నిర్ణయం తీసుకుంటే.. ఆయన పేరే ప్రధానంగా తెరపైకి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉంటే.. నాంపల్లి, గోషామహల్ సీట్లలో అభ్యర్థుల పెండింగ్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. ప్రతీసారి నాంపల్లిలో అభ్యర్థిని నిలబెట్టిన బీఆర్ఎస్ .. ఈసారి మిత్రపక్షం ఎంఐఎం కోసమే పెండింగ్ పెట్టిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
గోషామహల్‌లో బలమైన అభ్యర్థి కోసం..
అయితే, గోషామహల్‌లో బలమైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ వేట మొదలెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అంటూ ఇప్పటికే నగర మంత్రులు ప్రకటనలు చేయడంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. రాజాసింగ్ వైపు బీఆర్‌ఎస్ చూస్తుందా అనే వార్తలు కూడా జోరందుకున్నాయి. రాజాసింగ్ కోసమే ఆ స్థానం హోల్డ్‌లో పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇలాంటి చర్చల మధ్య గ్రేటర్‌లో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాల్సిందే..




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..